విదేశీ టి20లపై యువరాజ్‌ ఆసక్తి

20 May, 2019 04:54 IST|Sakshi

బోర్డు అనుమతిస్తే ఆడేందుకు సై

అంతర్జాతీయ క్రికెట్‌కువీడ్కోలు పలికే అవకాశం  

న్యూఢిల్లీ: భారత జట్టు నుంచి స్థానం కోల్పోయిన వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌ విదేశీ టి20 టోర్నీలపై ఆసక్తి కనబరుస్తున్నాడు. త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు అధికారికంగా గుడ్‌బై చెప్పి... భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతితో విదేశాల్లో జరిగే ప్రైవేట్‌ టి20 టోర్నీల్లో ఆడాలని భావిస్తున్నాడు. ‘యువరాజ్‌ బోర్డు నుంచి స్పష్టత కోరుతున్న మాట వాస్తవమే. కెనడాలో జరిగే ‘జి టి20’, ఐర్లాండ్, నెదర్లాండ్స్‌లలో జరిగే ‘యూరో టి20’లలో ఆడాలనుకుంటున్నాడు. అయితే అతను రిటైరైనా కూడా బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత్‌లో రిజిస్టర్‌ టి20 ప్లేయర్‌. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ టి20లో ఆడే వెసులుబాటు ఉందో లేదో ఓసారి చూసుకోవాలి’ అని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. కరీబియన్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడేందుకు భారత జట్టు మాజీ సభ్యుడు ఇర్ఫాన్‌ పఠాన్‌కు ఇటీవల బోర్డు నిరాకరించింది.

>
మరిన్ని వార్తలు