నకిలీ పత్రాలతో దొరికిపోయిన నటి

27 Aug, 2015 08:53 IST|Sakshi
నకిలీ పత్రాలతో దొరికిపోయిన నటి

చెన్నై: నకిలీ పత్రాలతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన కేరళ సహాయ నటిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె అనుచరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కేరళ రాష్ట్రం పత్తనందిట్టకు చెందిన  మళయాల నటి నీతూ కృష్ణ వాసు (28) అమెరికా వెళ్లేందుకు  వీసా కోరుతూ చెన్నై అమెరికన్ కాన్సులేట్‌కు వచ్చింది. ఆమె సమర్పించిన పత్రాలు నకిలీవని తేలడంతో అధికారులు రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 నీతూకృష్ణను ఇన్‌స్పెక్టర్ సత్యశీలన్ విచారణ జరిపారు.  పోలీసులు విచారణలో నీతూకృష్ణ పలు విషయాలను వెల్లడించింది. రాజి అనే సినీ నిర్మాత తనను సంప్రదించి అమెరికా వివాహ కార్యక్రమాల్లో డ్యాన్సులు చేసినట్లయితే అధికంగా సంపాదించవచ్చని తెలిపాడని, ఇందుకు చెన్నైకు వెళ్లి వీసా తీసుకోవడానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నాడని, దీంతో నగదును తాను అందచేసినట్లు చెప్పింది. అయితే  అతడు తనను మోసం చేస్తాడనుకోలేదని వాపోయింది. అలాగే బ్రోకర్లు రాజీ, కుంజుమోన్‌ల కోసం గాలిస్తున్నారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు