పోటీ పరీక్షలు కన్నడలో కూడా నిర్వహించాలి

11 Sep, 2017 08:54 IST|Sakshi
పోటీ పరీక్షలు కన్నడలో కూడా నిర్వహించాలి

సీఎం సిద్ధరామయ్య
మైసూరు: బ్యాంకుల్లో నియామకాల కోసం జరుగుతున్న పరీక్షలను కన్నడ భాషలో కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఆదివారం మైసూరు నగరానికి చేరుకున్న ఆయన మండకళ్లి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల్లో నియమితులయ్యే అధికారులు బ్యాంకులకు వచ్చే వారితో కన్నడ భాషలోనే సంభాషించాల్సి ఉన్న కారణంగా వారికి కన్నడ భాషలో కూడా పరీక్షలు రాయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు.

క జూన్, జులై నెలల్లో పూర్తిగా ముఖం చాటేసిన వర్షాలు ఆగస్ట్‌ నెల నుంచి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా కురవడంతో రాష్ట్రంలో తాగు,సాగు నీటి సమస్య తీరిపోయిందన్నారు. ఇక బెంగళూరులో కురిసిన భారీ వర్షానికి కారుపై చెట్టు కూలడంతో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలతో పాటు కాలువలో కొట్టుకుపోయిన వ్యక్తి కుటుంబానికి పరిహారం అందించాలంటూ మంత్రి కే.జే.జార్జ్‌కు సూచించామన్నారు.

ఇక గుర్తు తెలియన దుండగుల కాల్పుల్లో మృతి చెందిన పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్య కేసును తీవ్రంగా పరిగణించామని,  కేసుపై జరుగుతున్న విచారణ గురించి ఇప్పుడే మీడియాకు వెల్లడించలేమన్నారు. గౌరీలంకేశ్‌ హత్య దృష్ట్యా ప్రాణహాని ఉన్న అనేక మంది రచయితలు, సాహితీవేత్తలు, పాత్రికేయులకు రక్షణ కల్పించామన్నారు. ఇక మైసూరు నగరంలోనున్న కర్ణాటక ఓపెన్‌ యూనివర్శిటీకి యూజీసీ నుంచి గుర్తింపు కల్పించాలంటూ కేంద్రప్రభుత్వానికి లేఖ రాసామన్నారు. ఢిల్లీకి వెళ్లిన సమయంలో ఇదే విషయమై మరోసారి సంబంధిత అధికారులు, మంత్రిని కోరతామన్నారు. కార్యక్రమంలో మంత్రి మహదేవప్ప, కలెక్టర్‌ డీ.రందీప్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు