పాలన.. గాడిన

15 Oct, 2016 14:58 IST|Sakshi
పాలన.. గాడిన
  ప్రజల్లో తొలగుతున్న గందరగోళం
  ప్రభుత్వశాఖలపై పెరిగిన అవగాహన
  వీడియో కాన్ఫరెన్స్‌లతో కలెక్టర్ల బిజీబిజీ
  క్రైం మీటింగ్‌లతో పోలీస్ కమిషనర్...
  రెండోరోజు ‘కొత్త’ అధికారులు బిజీబీజీ
  అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి
 
 
సాక్షి, కరీంనగర్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా పలు ప్రభుత్వ శాఖల విలీనం, పాలన వ్యవస్థ తీరు తెన్నులపై ప్రజల్లో నెలకొన్న గందరగోళం ఇప్పుడిప్పుడే తొలగిపోతోంది. ప్రభుత్వ శాఖల విలీనం, పునర్విభజనపై అవగాహన పెరుగుతోంది. ఇప్పటివరకు విడివిడిగా ఉన్న జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా), ఇంది కాంత్రి పథం (ఐకేపీ), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఇప్పుడు ఒకే గొడుగు కిందకు వచ్చి డీఆర్‌డీఏగా అవతరించింది. అంతకు ముందున్న ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ) పోస్టును రద్దు చేసి ఇప్పుడు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్‌డీవో)గా నామకరణం చేశారు. స మాచారం పౌర సంబంధాల శాఖలో పర్యాటక, పురావస్తు, సాంస్కృతిక శాఖలను విలీనం చేయగా, ఇంతకు ముందు ఆ బాధ్యతలను చూసే డివిజనల్ పబ్లిక్ రిలేషన్ అఫీసర్ (డీపీఆర్వో) తప్పించారు. ఇప్పుడా బాధ్యతలను డిప్యూటీ డైరక్టర్(డీడీ) స్థాయి అధికారికి అప్పగించారు. కరీంనగర్‌కు ఈ పోస్టును కేటాయించి, త్వరలోనే డీడీని నియమించనున్నారు. అదేవిధంగా ఐసీడీఎస్ శాఖలోకి వికలాంగుల సంక్షేమశాఖ ను విలీనం చేశారు. వికలాంగ, వయోవృద్ధుల, శిశు మహిళాభివృద్ధి శాఖగా ఏర్పడగా, ఇదివరకున్న పీడీ పోస్టు స్థానంలో జిల్లా సంక్షేమాధికారిని నియమించారు. పౌరసరఫరాల శాఖలోను డీఎస్‌వో హోదాను పెంచి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (డీసీఎస్)గా చేశారు. ఇలా వాణి జ్య పన్నులు, ఇంటర్మీడియెట్  విద్య, బీసీ సంక్షే మ, పశుసంవర్ధక, గిరిజన సంక్షేమం, అటవీ, పోలీసుశాఖల్లోను జరిగిన స్వల్ప, భారీ మార్పులపై నెలకొన్న గందరగోళం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. 
 
అభివృద్ధి పథం, ఆశల సౌధం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లాల పునర్విభజన అనంతరం అభివృద్ధి, సంక్షేమ లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత, ఆ జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాల్లోను ఏ విధమైన అభివృద్ధి చేయవచ్చన్న దిశలో అధికార యంత్రాంగం అడుగులు వేస్తోం ది. ‘పునర్విభజన’లో జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి కొత్తగా ఏర్పడిన తర్వాత మిగిలిన కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై అధికార యంత్రాంగం ప్రధానంగా దృష్టి సారించింది. జిల్లాల పున ర్వి భజన అనంతరం జిల్లా కలెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్‌గా బద్రి శ్రీనివాస్, కొత్తగా ఏర్పడిన పోలీసు కమిషనరేట్‌కు కమిషనర్‌గా వీబీ.కమలాసన్‌రెడ్డి ఈ నెల 11న బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా టీమ్‌గా డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు, ఐసీడీఎస్ పీడీ గిరిజారాణి , వ్యవసాయాధికారి(డీఏవో) సీహెచ్.తేజోవతి, మెప్మా పీడీ వెంకటేశ్వర్లు, డీపీవో నారాయణ, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ మాధవరావు, జిల్లా వైద్య ఆర్యోగశాఖాధికారి రాజేశం, డీఈవో పెగుడ రాజీవ్, డీఐఈవో ఎల్.సుహాసిని తదితర శాఖల జిల్లా ఉన్నతాధికారులు అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ముందు కు సాగుతున్నారు. జిల్లాలోని పర్యాటక, పారిశ్రామిక ప్రాంతాలను గుర్తించే పనిలో నిమగ్నమైన యంత్రాంగం.. ఆ రంగాలపైనా నివేదికలు తయారు చేస్తోంది. ఖనిజ సంపద పరిరక్షణ, వినియోగం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంపుపైనా దృష్టి సారించారు. ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి అందరి లక్ష్యంగా ముందుకెళ్తుండటంలో యంత్రాంగం బిజీబిజీగా ఉన్నారు. 
 
జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు.  పథకాల అమలుపై అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 
జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్ ఇతర శాఖల అధికారులు పనుల్లో నిమగ్నం అయ్యారు.
కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి నేర సమీక్ష,  శాంత్రి భద్రతల పరిరక్షణ సమావేశాల్లో బిజీ బిజీగా ఉన్నారు. 

 

మరిన్ని వార్తలు