ఇక వదినమ్మ రాజ్యం

29 Jul, 2016 03:03 IST|Sakshi
ఇక వదినమ్మ రాజ్యం

సాక్షి,  చెన్నై: డీఎండీకేలో వదినమ్మ ప్రేమలత విజయకాంత్ ఇక పూర్తిస్థాయిలో చక్రం తిప్పబోతున్నారు. కొత్త రక్తంతో పూర్వవైభవం లక్ష్యంగా అడుగులకు సిద్ధ పడ్డ విజయకాంత్ తన సతీమణికి పార్టీలో పదవి కట్టబెట్టేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. త్వరలో ఇందుకు తగ్గ అధికార ప్రకటన వెలువడ బోతున్నది. పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శి పగ్గాలు వదినమ్మను వరించే అవకాశాలు ఉన్నట్టుగా డీఎండీకేలో చర్చ బయలుదేరడం గమనార్హం. సినీ నటుడి నుంచి రాజకీయ నేత గా ఎదిగిన విజయకాంత్‌కు వెన్నంటి ఆయన సతీమణి ప్రేమలత, బావ మరి ది సుదీష్ ఉంటూ వస్తున్నారు. సుదీష్ డీఎండీకే యువజన పగ్గాలతో ఆది నుం చి ముందుకు సాగుతూ వస్తున్నారు.
 
 పా ర్టీ ఆవిర్భావంతో డీఎండీకే వ్యవహారాలను తెర వెనుక నుంచి ప్రేమలత సా గించే వారు. 2011 ఎన్నికల్లో ఆమె పార్టీ కోసం పూర్తి స్థాయిలో తనను అంకితం చేసుకున్నారు. ఎలాంటి పదవి పార్టీలో లేకున్నా, ఆ ఎన్నికల్లో డీఎంకే పతనం లక్ష్యంగా ప్రచార బాధ్యతల్ని తన భుజాన వేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తన వాక్‌చాతుర్యంతో ప్రజ ల్ని ఆకర్షించారని చెప్పవచ్చు. ఆ ఎన్నికల్లో డీఎండీకే ప్రధాన ప్రతి పక్షంగా అవతరించడం ప్రేమలత బాధ్యతలు పెరి గాయి. పార్టీ అనుబంధ మహిళా విభా గం కార్యదర్శి పదవితో  పార్టీ వ్యవహారాల్లో ఆమె జోక్యం పెరిగిందని చెప్పవచ్చు. ఇది మరీ ఎక్కువ కావడంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకేకు పెద్ద దెబ్బ తగిలేలా చేశాయి.
 
 టార్గెట్ వదినమ్మ:
 ప్రజా సంక్షేమ కూటమిలోకి డీఎండీకేను తీసుకెళ్లడంలో ప్రేమలత కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు, విమర్శలు బయలు దేరాయి. వదినమ్మ తీరును ఖండిస్తూ, నిరసిస్తూ బయటకు వెళ్లిన వాళ్లు తీవ్రంగానే స్పందించారు. వాటిని ఖాతరు చేయని వదినమ్మ రాష్ట్ర వ్యాప్తం గా సుడిగాలి పర్యటనే సాగించారు. విజ యకాంత్ కేవలం బహిరంగ సభలకు పరిమితం అయితే, తానొక్కరే అన్నట్టుగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రేమలత  తీవ్రంగానే చక్కర్లు కొట్టారు. ఇంత వరకు సాగిన తతంగాలు ఓ ఎత్తు అయితే, ఎన్నికల అనంతరం డీఎండీకేను వీడే వారు మరీ ఎక్కువే అయ్యారు. వీళ్లు కూడా వదినమ్మను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన వాళ్లే.
 
 వదినమ్మకు పదవి:
 ఇన్నాళ్లు తన సతీమణికి పార్టీలో ఎలాం టి పదవి లేనందునే, విమర్శలు, ఆరోపణలు గుప్పించారని, ఇక, ఆమెను అందలం ఎక్కిస్తా చూడండి అన్నట్టు, ఉండే వాళ్లు ఉండొచ్చు, వెళ్లే వాళ్లు వెళ్లొచ్చన్న సంకేతాన్ని విజయకాంత్ జిల్లాల నేతల కు రెండు రోజుల క్రితం పంపిం చినట్టు సమాచారం. ఇప్పటికే డీఎండీకే నుంచి ముఖ్యమైన నాయకులు బయటకు వెళ్లిన దృష్ట్యా, ఇక ఉన్న వాళ్లందరూ తన అభిమానులేనని, వీరి ద్వారా సరికొత్త రక్తాన్ని నింపి, బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతానన్న ధీమాను విజయకాంత్ తన సంకేతంతో నేతల్లోకి పంపించి ఉండడం గమనార్హం.
 
 సరికొత్త అడుగులతో ముందుకు సాగి పూర్వ వైభవాన్ని చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉందని, స్థానిక సమరంతో సత్తా ను చాటుకోవాల్సి ఉన్నందున, పార్టీలో వదినమ్మకు పదవిని అప్పగించే విధం గా జిల్లాల్లో తీర్మానాలు చేసి రాష్ర్ట కమిటీకి పంపించాలని సూచించి ఉండటం ఆలోచించదగ్గ విషయమే. తానేదో స్వ యంగా వదినమ్మకు పదవి కట్టబెట్టినట్టుగా కాకుండా, జిల్లాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు అందలం ఎక్కించినట్టు చెప్పుకునేందుకే అన్నయ్య తన సంకేతా న్ని పంపించినట్టుగా డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాల కమిటీల సమావేశాల్లో తీసుకునే తీర్మానం మేరకు త్వరలో రాష్ట్ర కమిటీ ఆమోదించి వదినమ్మకు పార్టీలో పదవి కట్టబెట్టడం ఖాయం అంటున్నారు.
 
 వదినమ్మకు పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శి పగ్గాలు అప్పగించేందుకు అవకాశాలు ఉన్నాయ ని, ఆ పదవికి ఆమె అన్ని రకాలుగా అర్హురాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. విజయకాంత్ సంకేతం అలా పంపించారో లేదో, ఇలా కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం జిల్లాల నేతలు ఇందుకు తామూ ఒకే అన్నట్టుగా తమ అన్నయ్యకు లేఖల్ని పంపించి ఉండడం విశేషం. విజయకాంత్ ఆరోగ్య పరంగా సమస్యల్ని ఎదుర్కొంటున్న దృష్ట్యా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార పర్యటనలు సాగించడం కష్టతరమే. ఇందుకు నిదర్శనం అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం బహిరంగ సభలకే ఆయన పరిమితం కావడమే.
 
 ఈ దృష్ట్యా, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, కేడర్‌లో ఉత్సాహం నింపడం, పూర్వ వైభం లక్ష్యంగా ముందుకు సాగాలంటే, వదినమ్మకు తగిన బాధ్యతలు తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తించే తమ అన్నయ్య పదవీ నిర్ణయాన్ని తీసుకున్నట్టు డీఎండీకే నాయకుడు ఒకరు పేర్కొనడం గమనార్హం. వదినమ్మ చేతికి పదవి దక్కిన పక్షంలో, ఇక  డీఎండీకేలో ఆమె పూర్తిస్థాయిలో చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువే. ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు, పరిణామాలకు దారి తీస్తాయో అన్నది వేచి చూడాల్సిందే.
 

మరిన్ని వార్తలు