మెడికల్ సీటు కోసం ఆరు పరీక్షలా?

29 Jul, 2016 06:45 IST|Sakshi
మెడికల్ సీటు కోసం ఆరు పరీక్షలా?

ఎంసెట్-3 యోచనతో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనలో పడేసింది. లీకేజీ నిర్ధారణ కావడంతో మరో పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుండటం వారిని ఆవేదనకు గురిచేస్తోంది. ఎవరో చేసిన తప్పిదాలతో తాము ఆరు ప్రవేశపరీక్షలు రాయాల్సి దుస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

టాప్ ర్యాంకులు సాధిస్తే తప్ప కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు రాని పరిస్థితిలో విద్యార్థులు పగలూ రాత్రీ కష్టపడి చదువుకున్నారు. ఎక్కడ అడ్మిషన్లకు అవకాశముంటే ఆ పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వరుసగా ఒకదాని తరువాత ఒకటి ఐదు పరీక్షలు రాశారు. తాజాగా ఎంసెట్-2 పేపర్ లీకవడం, ఎంసెట్-3 నిర్వహించాలని సర్కారు యోచిస్తుండంతో విద్యార్థులు ఆందోళనలో మునిగిపోతున్నారు. ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల్లో ఎంసెట్-3కి ఎలా సిద్ధం కావాలని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు