మాజీ సింగరేణి కార్మికుల ఆందోళన

7 Oct, 2016 12:09 IST|Sakshi
మందమర్రి-బెల్లంపల్లి: సింగరేణిలో వీఆర్‌ఎస్ తీసుకున్న కార్మికులకు, డిస్మిసల్ కార్మికులకు అన్యాయం జరుగుతోందంటూ ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. మందమర్రి పట్టణం యాపల్‌లోని వాటర్ ట్యాంక్ 20 మంది ఎక్కారు. మొత్తం 3,100 మంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోగా 100 మందికే తిరిగి ఉద్యోగాలు దక్కుతాయని వారన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటన తమకు తీవ్ర నిరాశ కలిగించిందని వారు తెలిపారు. ఏళ్లుగా తాము పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెలిపారు.
 
అలాగే, బెల్లంపల్లిలో ఓ మాజీ కార్మికుడు సెల్‌టవర్ ఎక్కి దూకుతానని బెదిరిస్తున్నాడు. సింగరేణి డిస్మిసల్ కార్మికుడు సమ్మయ్య స్థానిక బజార్ ఏరియాలోని వాగ్దేవి జూనియర్ కళాశాల భవనంపై ఏర్పాటు చేసిన సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. తనలాంటి వందలాది డిస్మిసల్ కార్మికులకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
 
ఇదిలా ఉండగా, ఆదిలాబాద్ జిల్లా రెబ్బనలోని సింగరేణి ప్రాంతం గోలేటి టౌన్‌షిప్‌లో కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. తమకు అత్యధిక పండుగ బోనస్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
 
>
మరిన్ని వార్తలు