త్వరలో నక్షత్ర వనం

9 Mar, 2014 22:01 IST|Sakshi

 కాలుష్య నియంత్రణే లక్ష్యం
 బృహన్ మహారాష్ట్ర కామర్స్ కళాశాల వినూత్న ఆలోచన
 
 పింప్రి, న్యూస్‌లైన్: కాలుష్య నియంత్రణపై  పుణేలోని బృహన్ మహారాష్ట్ర కామర్స్ కళాశాల దృష్టి సారించింది. ఇందులోభాగంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కళాశాల ఆవరణలో నక్షత్ర వనాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ వనంలో నక్షత్రాలకు సంబంధించి (భరణి నక్షత్రం, ఉసిరి)న మొక్కలను నాటనున్నారు. ఒక్కో మొక్క ఒక్కో ఔషధ గుణం కలిగి ఉండడంతో నగర వాసులకు ఆరోగ్య సమస్యల నుంచి కూడా కొంత మేర ఊరట లభిస్తుందని సదరు కళాశాల ప్రిన్సిపల్ చంద్రకాంత్ రావల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో మొక్క వద్ద మొక్కకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసే ఓ పట్టికను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అనేక పురాణ శాస్త్రాలు నక్షత్రాల ప్రభావాన్ని  తెలి యజేస్తున్నాయన్నారు. అందువల్లనే ఈ వనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. నక్షత్రా ల స్వభావాన్ని బట్టి మొక్కల ఎంపిక జరిగిందని రావల్ తెలిపారు. ఆకాశంలో ప్రతి నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉన్నట్లే ఈ నక్షత్ర మొక్క కూడా ప్రత్యేకతను కలిగి ఉంటుందన్నారు.
 
 ఈ నక్షత్ర వనానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి స్థల సేకరణ కూడా జరిగిందని తెలిపారు. లాండ్ స్కేపింగ్ పను లు పూర్తయిన వెంటనే నక్షత్ర నమూనా ప్రకారం మొక్కలను నాటుతామన్నారు. అశ్విని నక్షత్రానికి సంబంధించిన ముష్ఠి (కుప్పిలు) మొక్కలను నాటతామన్నారు. ఈ మొక్క ఔషధ గుణం కలిగినదని, చర్మ సంబంధ వ్యాధులు, కండరాల నొప్పు లు, కఫ, వాత రోగాలకు బాగా ఉపకరిస్తుందన్నా రు. అదేవిధంగా భరణి నక్షత్రానికి సంబంధించిన మొక్కను ఉసిరిగా గుర్తించారని, ఈ మొక్క రక్తాన్ని వృద్ధి చేయడంతోపాటు జ్వరాలు, దగ్గు, వైరస్, ఫంగస్‌ను నిర్మూలిస్తుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుందన్నారు. జ్యేష్ఠ నక్షత్రం కోసం దేవదారు మొక్కను నాటనున్నామన్నారు. అదేవిధంగా అనురాధ-పొగడ, విశాఖ- వికంకట, స్వాతి- మద్ది, చిత్త-బిల్వం, హస్త-అడవి మామిడి, ఉత్తర- జువ్వి, పూర్వ- మొదుగ, మఖ-సోమి, ఆశ్లేష- చంపేయ, పుష్యమి-రావి చెట్టు, పునర్వసు-వెదురు, ఆరుద్ర- మిరియాలు, మృగశిర-సండ్ర, రోహిణి-నేరేడు, కృత్తిక-అత్తి, భరణి-ఉసిరిక, అశ్విని-ముష్టి, రేవతి-విప్ప, ఉత్తరాభాద్ర-మామిడి, పూర్వాభాద్ర-వేప, శతభిషం-కదంబం, ధనిష్ట-జమ్మి, శ్రవణ-జిల్లేడు, ఉత్తరాషాఢ-పనస, పూర్వాషాఢ-వంజుల, మూల-సరుజ నక్షత్రాలకు సంబంధించి 27 మొక్కలను నాటాలని  కళాశాల యాజమాన్యం నిర్ణయించింది.
 
 
 

మరిన్ని వార్తలు