చెత్తపై పోరు

22 Dec, 2014 02:09 IST|Sakshi
చెత్తపై పోరు

తమ గ్రామంలో చెత్త వేయొద్దంటూ
అజ్జగొండనహళ్లి వాసుల నిరసన
అధికారులు స్పందించకపోవడంతో
రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న రైతు
తీవ్ర ఉద్రిక్తత పోలీసుల ఘర్షణ  
పోలీసుల కళ్లల్లో కారం కొట్టి
దాడులు చేసిన గ్రామస్తులు
ఇద్దరు ఎస్సైలతో సహా 11 మందికి తీవ్రగాయాలు
 

అజ్జగొండనహళ్ళి.. ఆగ్రహంతో మండింది. తమ గ్రామంలో చెత్త వేయొద్దంటూ ఆ గ్రామస్తులు హెచ్చరించారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో... ఓ రైతు శనివారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల కళ్లల్లో కారం కొట్టి.. వారిని చితకబాదారు. వారిని అదుపు చేయడంలో భాగంగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ  ఘర్షణలో పోలీసులతో సహా గ్రామస్తులూ గాయపడ్డారు. కలెక్టర్, ఎస్పీ సహా కీలక అధికారులందరూ ఆ గ్రామంలో తిష్ట వేశారు. ఆ గ్రామంలో బంద్ వాతావరణం నెలకొంది.
 
తుమకూరు: తాలూకాలోని అజ్జగొండనహళ్ళి గ్రామంలోని ప్రభుత్వ భూమిలో తుమకూరు నగర పాలికే చెత్తను వేయడానికి స్థలాన్ని కేటాయించింది. దీంతో అజ్జగొండనహళ్ళి గ్రామస్తులు గత కొంత కాలంగా తుమకూరుకు చెందిన చెత్తను ఇక్కడ వేయవద్దని నిరసనలు తెలుపుతున్నారు. అధికారులు మాత్రం అక్కడే చెత్త వేస్తామని తెలిపారు. దాంతో గ్రామస్తులు  నాలుగు రోజుల నుంచి తీవ్ర స్థాయిలో ధర్నా చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన శివకుమార్ (30) ఇక్కడ చెత్తను వేయవద్దని లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని అధికారులను హెచ్చరించారు. అయినా వారు స్పందించకపోవడంతో  శివకుమార్ శనివారం రాత్రి  రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహం మిన్నంటింది. వృతదేహాన్ని ఆస్పత్రి ముందు ఉంచుకొని ధర్నా చేశారు. సంఘటణ స్థలానికి వచ్చిన పోలీసులు  ఆ గ్రామస్తులకు నచ్చజెప్పె ప్రయత్నం చేశారు. గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి నిరసనలను చేయవద్దని హెచ్చరించారు. కాని గ్రామస్తులు అందరు కలిసి రాత్రి తొమ్మిది గంటల సమయంలో గ్రామంలో  కరెం టును నిలిపేసి..  పోలీసులపై  దాడులు చేశారు. కొంత మంది కారం తీసుకొవచ్చి పోలీసుల కళ్లల్లో చల్లి దాడి చేశారు. ఈదాడిలో సీఐ రవి, అబ్దుల్ ఖాదర్‌లతో పాటు మొత్తం 11 మంది పోలీసులు గాయపడ్డారు. అబ్దుల్ ఖాదర్ తలకు తీవ్ర గాయం కావడంతో సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు దాడి చేసిన కొంది సేపటికి మరింత పోలీసు బలగాలను అధికారులు ర ప్పించారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి  పోలీసులు గాలిలో కాల్పులను జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గ్రామస్తులు గాయపడ్డారు.

వారిని కూడా గ్రామస్తులు ఆస్పత్రిలో చేర్పిం చారు. మరింత ఆగ్రహించిన గ్రామస్తులు రెండు పోలీస్  వాహనాలకు నిప్పు చెప్పారు. మరో మూడు పోలీస్ జీపులను ధ్వంసం చేశారు.  జిల్లా ఎస్పీ రమణగుప్త ఆ గ్రామానికి చేరుకొని.. పరిస్థితిని అదులోకి తెచ్చారు. గ్రామంలో బంద్ వాతారణం నెలకొంది.ఆదివారం ఉదయం ఆ గ్రామంలో ఎక్కడ చూసినా పోలీసులే కన్పిస్తున్నారు. మగవారు ఇళ్లలో నుంచి బయటికి రావడంలేదు. అక్కడక్కడ మహిళలు కన్పిస్తున్నారు. ఇప్పటికే  సుమారు 19 మంది గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాధికారి సత్యమూర్తి కూడా ఆ గ్రా మంలో తిష్టవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తు లు ఆందోళనకు గురి కావద్దని, ప్రభుత్వంతో మాట్లాడి శివకుమార్ కు టుంబానికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ పోలీ సులపై దాడి చేయవద్దని కోరారు. కాగా ఆదివారం కూడా ఆ గ్రామంలో మహిళలు నిరసన చేపట్టారు. సుమారు రెండు వేల మంది ఒకచోట చే రి.. ఆందోళన చేపట్టారు. గ్రామంలో చెత్త ఘటకాన్ని ఏర్పాటు చేయబోమని జిల్లా ఇన్‌చార్‌‌జ మంత్రి హామీ ఇచ్చేంతవరకూ ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. జిల్లాదికారి సత్తమూర్తి ఎంత చెప్పినా వారు వినలేదు.
 

మరిన్ని వార్తలు