హెర్బల్ రంగులకు ఆదరణ

15 Mar, 2014 01:27 IST|Sakshi
హెర్బల్ రంగులకు ఆదరణ

న్యూఢిల్లీ: రసాయనిక రంగుల వల్ల కలిగే  దుష్ర్పభావాల గురించి విస్తృత ప్రచారం జరగడం వల్ల చాలా మంది హోలీ పండుగ కోసం హెర్బల్ రంగులు (చెట్ల ఉత్పత్తులతో తయారయ్యేవి) వాడడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయాన్ని దుకాణదారులు కూడా గుర్తించారు. ఒకప్పుడు కొన్ని ప్రత్యేక దుకాణాల్లో మాత్రమే లభించిన హెర్బల్ హోలీ రంగులు ఇప్పుడు నగరమంతటా దొరుకుతున్నాయి. ప్రముఖ మిఠా యి దుకాణాలు గుజియా వంటి సంప్రదాయ హోలీ మిఠాయిల డబ్బాతోపాటు హెర్బల్ హోలీ రంగులను ప్యాక్ చేసి అందిస్తున్నాయి.
 

 హెర్బల్ రంగుల తయారీ ఇలా..

 ఈ రంగులను ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చని పర్యావరణ విభాగం ప్రచారం చేస్తోంది. దానిమ్మ పండుపొట్టు, ఎండిన గులాబీ రెక్కలను నీటిలో మరిగిస్తే ఎరుపు రంగు సిద్ధమవుతుంది. ఎండిన బంతిపూల రెక్కలు, పసుపు, శనగపిండి ని నీటిలో కలిపితే పసుపురంగు తయారవుతుం ది. పుదీనా పేస్ట్, పాలకూర పేస్ట్, గోరింటా కు పొడిని నీటిలో కలిపి ఆకుపచ్చ రంగును, బీట్‌రూట్ కోరును నీటిలో నానబెట్టి గులాబీ రంగు ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని పర్యావరణ విభాగం తెలియచేసింది.
 

 నీటి సంరక్షణపై ఆర్‌డబ్ల్యూఏల ప్రచారం
 

రసాయనిక రంగుల వల్ల కళ్లకు, చర్మానికి కలిగే హాని గురించి, నీటిని పొదుపు చేయవలసిన ఆవశ్యకత గురించి నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. నీళ్ల రంగులకు బదులు పొడిరంగులతో హోలీ ఆడవలసిందిగా నివాసుల సంక్షేమ సంఘాలు (ఆర్‌డబ్ల్యూఏలు) ఇప్పటికే తమ కాలనీవాసులకు విజ్ఞప్తి చేశాయి. హోలీ సమయంలో నీటిని వృథా చేయవద్దని చెప్పడానికి పండుగ ముందే సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపాయి. ఈ మేరకు కాలనీవాసులకు ఎస్‌ఎంఎస్‌లను పంపుతున్నట్లు రూప్‌నగర్ ఆర్‌డబ్ల్యూఏ అధ్యక్షుడు సుదేశ్ బేనీవాల్ చెప్పారు.

హోలీ సమయంలో నీటి వృథాను అరి కట్టవలసిందిగా ఆర్‌డబ్ల్యుఏలకు ట్విటర్, ఫేస్‌బుక్ వంటి సైట్ల ద్వారా సందేశాలు పంపిస్తున్నామని యునెటైడ్ ఆర్‌డబ్ల్యుఏ జాయింట్ యాక్షన్ కన్వీనర్ అతుల్ గోయల్ చెప్పారు. రసాయనికరంగుల్లో ఉండే సీసం, సిలికాన్ వంటివి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన హెచ్చరించారు.
 

గర్భిణులకు మరింత ప్రమాదం

 దుకాణాల్లో దొరికే కొన్ని హెర్బల్ రంగులు కూ డా గర్భిణుల ఆరోగ్యంపై ప్రభావం చూసే అవకాశముందని డాక్టర్లు అంటున్నారు. ఇలాంటి రంగుల్లోనూ సీసం, మెర్కురీ వంటివి పిండానికి హాని చేస్తాయని ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రి గైనకాలజిస్టు అనురాధా కపూర్ అన్నారు. ‘బ్లాక్ హె నా్ను మం చిదని చాలా మంది అనుకుంటారు. అందులో ఉండే పీపీడీ అనే రసాయనం వల్ల ఎలర్జీలు వస్తా యి. కాబట్టి గర్భిణులు ఇంట్లో తయారు చేసిన రం గులను మాత్రమే వాడాలి.

‘నేచురల్’ అని లేబుల్ కనిపించేవన్నీ మంచి రంగులని చెప్పలేం. వీటిలోని రసాయనాలు చర్మం ద్వారా లోపలికి వెళ్తాయి’ అని ఆమె వివరించారు. సహజరంగులు వాడినా కాసేపటికి శుభ్రంగా కడుక్కోవాలని స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు