ఆకలి చావులు దురదృష్టకరం

10 Jul, 2015 01:14 IST|Sakshi
ఆకలి చావులు దురదృష్టకరం

- హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్
నాగ్‌పూర్:
‘ప్రభుత్వం వద్ద భారీగా ఆహారధాన్యం నిల్వ ఉన్నప్పటికీ దేశంలో ఆకలి చావులు జరుగుతుండటం దురదృష్టకరం’ అని హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ వ్యాఖ్యానించారు. విదర్భ జన్ అందోళన్ సమితి అధ్యక్షుడు కిశోర్ తివారీతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘పర్వతాల్లా పెరుగుతున్న ధాన్యం నిల్వలు, ఆకలితో మగ్గుతున్న కోట్లమంది గురించి ప్రజల ముందు ఉంచుతున్న మిమ్మ ల్ని చూసి గర్వపడుతున్నా’ అని తివారీని ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. గోందియా జిల్లాలో జరిగి న ఆకలి చావుపై ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.
 
జరిగింది ఇదీ..

గోందియా జిల్లాలోని గిరిజన ప్రాంతంలో నివసించే లలితా ఎస్. సింగారీ(36) అనే దళిత వితంతువు ఆకలితో చని పోయింది. దీనిపై తీవ్రం గా స్పందించిన కిశోర్ తివారీ, ప్రభుత్వం ఎన్‌ఎఫ్‌ఎస్ చట్టాన్ని అమలుచేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బాంబే హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచి, గోందియా జిల్లాలో మరణించిన దళిత వితంతువు విషయంపై నివేదిక అందజేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఆహార, పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శికి జస్టిస్ భూషన్ గోవాయ్, జస్టిస్ ఇందూ జైన్‌తో కూడిన బెంచి నోటీసులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు