కరపత్రాలు పంపిణీ చేస్తే గూండా చట్టమా !

21 Jul, 2017 04:06 IST|Sakshi
కరపత్రాలు పంపిణీ చేస్తే గూండా చట్టమా !

సీమాన్‌ ఆగ్రహం
గొంతునొక్కాలని చూస్తే రెట్టింపు ఉత్సాహంతో ఆందోళన
అవినీతిని ప్రశ్నించే హక్కు కమల్‌కు ఉందని వ్యాఖ్య


తిరువళ్లూరు: కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకించిన వలర్మతి అనే విద్యార్థిని పై గూండా చట్టాన్ని ప్రయోగిస్తే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సినీనటుడు నామ్‌తమిళర్‌ కోఆర్డినేటర్‌ సీమాన్‌ హెచ్చరించారు. తమిళనటుడు ప్రముఖ నిర్మాత జయరామ్‌ 2010వ సంవత్సరంలో ప్రయివేటు టీవీ చానల్‌కు ఇచ్చి న ఇంటర్వ్యూలో తమిళ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో దుమారం రేగింది.

మహిళలను కుక్కలు, పందులతో పోల్చడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరగగా, 2010 ఫిబ్రవరి 5న వలసరవాక్కంలోని జయరామ్‌ ఇంటి వద్ద నామ్‌తమిళర్‌ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో కొందరు జయరామ్‌ ఇంటిపై దాడులు చేశారు. ఈ సంఘటనపై వలసరవాక్కం పోలీసులు సీమాన్‌ సహా 18 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు గురువారం ఉదయం తిరువళ్లూరుకు సీమాన్‌ తన మద్దతు దారులతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన న్యాయమూర్తి ఇళంగోవన్‌ ఆగస్టు 24న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు.

గొంతునొక్కాలని చూస్తే..:
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేఖ విధానాలపై వలర్మతి అనే విద్యార్థి కరపత్రాలను పంపిణీ చేస్తే ఆమెపై గూండా చట్టాన్ని ప్రయోగించడాన్ని తప్పుపట్టారు. తప్పులను ఎత్తిచూపడం వల్ల శాంతిభద్రతలకు ఎలా విఘాతం కలు గుతుందని సీమాన్‌ ప్రశ్నించారు. కదిరా మంగళంలో పోరాటం చేస్తున్న వేలాది మందిపై కూడా గూండా కేసులు పెడతారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో అవినీతిని ప్రశ్నించడానికి రా జకీయ పార్టీకి చెందిన నేతలే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా ప్రశ్నించవచ్చని వివరిస్తూ, ఇటీవల కమల్‌ చేస్తున్న ఆరోపణలో వాస్తవముందని వ్యాఖ్య నించారు. అయితే అన్నాడీఎంకే ప్రభుత్వం చేస్తున్న అవినీతిలో డీఎంకే నేత స్టాలిన్‌ పరోక్షంగా సాయం చేస్తున్నారన్న విషయాన్ని కమల్‌ గుర్తించుకోవా లని హితవు పలికారు. జయలలిత  పాలన కంటే ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వం పర్వాలేదని, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులు మాట్లాడే పరిస్థితి లేదని అయితే ప్రస్తుతం మంత్రులు మాట్లాడుతున్నారని వివరించారు.

మరిన్ని వార్తలు