‘కృష్ణా’పై మరోసారి విచారణ

31 Jan, 2017 02:45 IST|Sakshi
‘కృష్ణా’పై మరోసారి విచారణ

అఫిడవిట్‌ సమర్పణకు గడువు కోరనున్న తెలంగాణ
సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల వివా దంపై మరోమారు బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు మంగళవారం విచారణ జరుగనుంది. ఉమ్మడి రాష్ట్రా నికి చేసిన కేటాయింపుల నుంచే రెండు కొత్త రాష్ట్రాలు కృష్ణా జలాలను పంచుకోవా లంటూ అక్టోబర్‌లో తీర్పును వెలువరించిన అనంతరం తొలిసారి ట్రిబ్యునల్‌ మళ్లీ దీనిపై విచారణ జరుపనుంది. దీనికోసం రాష్ట్ర అధి కారులు సోమవారమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే తాను సమర్పించాల్సిన అంశంపై తెలంగాణ వాయిదా కోరే అవ కాశం ఉండగా, సుప్రీంకోర్టులో ఇప్పటికే దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్  అంశాన్ని ఏపీ ట్రిబ్యునల్‌ దృష్టికి తెచ్చే అవకాశం ఉంది.

నిజా నికి రెండు రాష్ట్రాలకే తదుపరి విచారణ పరిమితం అవుతుందని పేర్కొంటూ తీర్పు వెలువరించిన సమ యంలోనే నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల మధ్య ఆపరేషన్  ప్రొటోకాల్‌ తెలంగాణ, ఏపీకే పరి మితమని ట్రిబ్యునల్‌ తేల్చిచెప్పింది. సెక్షన్  89 పరిధిపై వివాదం పరిష్కారమైందని,  నీటి కేటాయిుంపులు, ప్రాజెక్టు వారీ కేటా యింపులు తేల్చేందుకు మళ్లీ విచారణను చేపడతామంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు