గవర్నర్‌ తమిళిసై దీపావళి శుభాకాంక్షలు 

12 Nov, 2023 01:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు.

ఆధునిక సమాజంలోని చెడులపై విజయం సాధించి, శాంతి, మతసామరస్యం, సోదరభావంతో కూడిన సమాజనిర్మాణానికి ఈ పండుగ స్ఫూర్తిని కలిగిస్తుందని అన్నారు.ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తితో పండుగ సందర్భంగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి ఇక్కడి ఉత్పత్తిదారులకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖసంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు