లా విద్యార్థుల రాస్తారోకో

7 Feb, 2015 04:13 IST|Sakshi
లా విద్యార్థుల రాస్తారోకో

తిరువళ్లూరు: చెన్నైలో ఉన్న లా కళాశాలను కాంచీపు రం తిరువళ్లూరుకు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన లా విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా తిరువళ్లూరులోని మెజిస్ట్రేట్ కోర్టు వద్ద శుక్రవారం లా విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమానికి లా విద్యార్థుల కోఆర్డినేటర్ జార్జిముల్లర్ అద్యక్షత వహించారు. రాస్తారోకో కార్యక్రమానికి తమిళనాడు, ఆంధ్ర లా విద్యార్థులు ఉమ్మడి ఐక్యవేదిక  ఆధ్వర్యంలో నిర్వహించారు.

జార్జిముల్లర్ మాట్లాడుతూ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం అంబేద్కర్ లా కళాశాలను తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాకు తరలించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న లా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పాటు అంబేద్కర్ లా కళాశాల మార్పు నిర్ణయూన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

రాస్తారోకోతో దాదాపు 40 నిమిషాల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం కోర్టు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు