అనంతలో ఉద్రిక్తత: బస్సులు, ఏటీఎంలపై దాడులు

24 May, 2017 15:00 IST|Sakshi
అనంతపురం: అనంతపురంలో వామపక్షాల బంద్‌ ఉద్రిక్తతకు దారితీసింది. రామచంద్రనగర్‌లో ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. 10 బస్సులు, 5 దుకాణాలను ధ్వంసం చేశారు. పలు దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేయగా ఇండియన్‌ బ్యాంకు పై రాళ్లదాడి జరిగింది. ఏటీఎంను కూడా ధ్వంసం చేశారు. మడకశిరలో కూడా వామపక్షాల కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. కాగా ఆందోళన చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఏఐసీటీయూ రాష్ట్ర కార్యదర్శి ఓబులేశులను పోలీసులు అరెస్టు చేశారు.
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు