మోహన్ సేవలు అభినందనీయం

24 Jan, 2015 03:54 IST|Sakshi
మోహన్ సేవలు అభినందనీయం

కొరుక్కుపేట : మదుమేహ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచుతూ మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్ మోహన్ డయాబటీస్ ఆస్పత్రి సేవలు అభినందనీయమని చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ కౌన్సిల్ జనరల్ ఫిలిప్ ఎ.మిన్ పేర్కొన్నారు. ఈ మేరకు మద్రాసు డయాబటీస్ రీసెర్చీ ఫౌండేషన్ ( ఎండీ ఆర్ ఎఫ్) డాక్టర్ మోహన్ డయాబటీస్ స్పెషాలిటీస్ సెంటర్ (డీఎం డీఎస్‌సీ) ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 13వ నాన్ కమ్యునికేబుల్ డిసీజస్ నివారణ నియంత్రణ అనే అంశంపై సదస్సు ప్రారంభమైంది.

దీనికి స్థానిక గోపాలపురంలోని మద్రాసు డయాబటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆడిటోరియం వేదికైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫిలిప్ ఎ.మిన్, గౌరవ అతిథిగా న్యూ ఢిల్లీ భారత ప్రభుత్వ డిపార్టుమెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ సెక్రటరీ ప్రొఫెసర్ కె.విజయ్ రాఘవన్ హాజరయ్యూరు. ఈ సందర్భంగా సైన్స్ బయోటెక్నాలజీ రంగంలో విశేష కృషి చేస్తున్నందుకు గాను ఎండి ఆర్ ఎఫ్, ప్లోరిడా ఇంటర్‌నేషనల్ యూనివర్సిటీ ( ఎఫ్ ఐ యూ),యూనివర్సిటీ ఆఫ్ అలభామ బిర్మింగం (యూఏబీ) 10వ గోల్డ్ మెడల్ ఒరేషన్ అవార్డును ప్రశంశాపత్రాన్ని డాక్టర్ కె.విజయ్ రాఘవన్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫిలిప్ ఎ.మిన్ అందజేశారు.

అనంతరం ఫిలిప్ ఈ సందర్భంగా ఫిలిప్ ఎ.మిన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ ప్రజలు డయాబటీస్‌తో బాధపడుతున్నారని అన్నారు. క్రమం తప్పక వ్యాయామాలు, పోషక విలువతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వలన డయాబటీస్‌కు గురవుతున్నారని అన్నారు. యూఎస్, భారత్ కలిసి వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వస్తున్నామన్నారు. ప్రధానంగా నాన్ - కమ్యూనికేబుల్ వ్యాధులు ప్రజలను ఎంతో బాధిస్తున్నాయన్నారు.

డయాబటీస్ పట్ల విశేషంగా వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్ మోహన్ డయాబటీస్ ఆసుపత్రి సేవలు అభినందనీయమన్నారు. సైన్స్‌లో విశేష కృషి చేసిన కె.విజయరాఘవన్‌కు ఒరేషన్ అవార్డు అందజేయటం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మోహన్ డయాబటీస్, ఎండీ ఆర్ ఎఫ్ నిర్వాహకులు, ప్రెసిడెంట్ డాక్టర్ వీ.మోహన్ మాట్లాడుతూ డయాబటీస్‌తో బాధపడేవారికి అత్యుత్తమ వైద్యం అందిస్తూ వస్తున్నామన్నారు.

డయాబటీస్ నియంత్రణ, నివారణకు పరిశోధనలు చేపడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఎండీ ఆర్‌ఎఫ్ ఆర్గనైజేషన్ ద్వారా 9వేల మంది ఉచితంగా డయాబటీస్ ట్రీట్‌మెంట్  తీసుకుంటున్నారని గుర్తు చేశారు. అంతేకాకుండా బ్రేక్ రైస్ హై పైబర్ రైస్‌తో పాటు డయాబటీస్ రోగులకు ఫుట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.

మరిన్ని వార్తలు