హత్యను ఆత్మహత్యగా మార్చేందుకు బేరాలు

7 Mar, 2015 02:07 IST|Sakshi

తిరువొత్తియూరు: అత్యాచారం చేసి సజీవ దహనం చేసిన నర్సింగ్ విద్యార్థిని కేసును ఆత్మహత్యగా మార్చేందుకు పోలీసులు డాక్టర్లతో బేరం మాట్లాడుతున్నారు. గత నెల 14వ తేదీ తిరుచ్చి సెంట్రల్ జైలు సమీపంలో వున్న ఆసుపత్రిలో ఒక బైకు చోరీ చేయడానికి ప్రయత్నించిన యువకున్ని ఆటో డ్రైవర్లు చుట్టుముట్టి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతను ముసిరి తాపేటకు చెందిన తంగదురై (30) అని తెలిసింది.

ఇతను తాను చోరీ చేసిన బైకులకు నంబరు ప్లేట్లను మార్చి కోర్టు వేలం ఎత్తినట్లు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇలా విక్రయించిన డబ్బులతో ఉల్లాసంగా గడిపేవాడని తెలిసింది. అతని నుంచి పోలీసులు 103 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన తంగదురై గత 23వ తేదీ జ్యుడిషియల్ కోర్టులో హాజరు పరిచారు. జైలులో బంధించారు. తంగదురైకు సహాయపడిన ప్రైవేటు ఆసుపత్రి ఉద్యోగి తురైయూర్ ఆంగియంకు చెందిన ఉదయన్ (29) అనే వ్యక్తిని అరెస్టు చేసి జైలులో ఉంచారు.

పోలీసులు తంగదురైను రెండు రోజులు కస్టడీకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. బైకుల విక్రయించగా అందులో వచ్చే నగదుతో కొంతమంది విద్యార్థినులను లోబరచుకునే వాడని తెలిసింది.  ఇందుకు ప్రైవేటు ఆసుపత్రి ఉద్యోగి ఉదయన్ సహాయపడినట్టు తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో తంజావూరుకు చెందిన నర్సింగ్ విద్యార్థినిపై గత సంవత్సరం జనవరి 1వ తేదీ రాత్రి ఓ డాక్టరుతో కలసి అత్యాచారం చేశాడని, ఆ సమయంలో విద్యార్థిని ఎదురు తిరగడంతో ఆమెపై దాడి చేయడంతో విద్యార్థిని కింద పడి తలకు తీవ్ర గాయమై మృతి చెందింది.

తంగదురై తన మిత్రుని సహాయంతో విద్యార్థినిపై కిరోసిన్ పోసి తగులపెట్టాడు. దీనిపై సమాచారం అందుకున్న పుదియ తలమురై కార్పొరేషన్ కార్యదర్శి శంకర్ నేతృత్వంలో విద్యార్థిని మృతిపై ఆందోళన చేశారు. ఆందోళనలో విద్యార్థిని మృతిలో సందేహం ఉందని ఆత్మహత్య చేసుకున్న గది అగ్నిజ్వాలలు గోడలపై తగులలేదని హత్య చేసి విద్యార్థిని తగులబెట్టారని సందేహం వెలిబుచ్చారు. ఆ సమయంలో విచారణ అధికారిగా ఉన్న సహాయ కమిషనర్ గణేషన్ హఠాత్తుగా మూడు రోజులకు సెలవు పెట్టి బయటకు వెళ్లారు. తరువాత ఈ కేసును ఆత్మహత్య కేసుగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ కేసు ఆత్మహత్యగా రుజువు చేయడానికి సంబంధిత డాక్టరుతో పోలీసులు బేరం మాట్లాడుతున్నట్టు తంగదురై తెలిపాడు.

మరిన్ని వార్తలు