నగ్మా అసంతృప్తి

6 Mar, 2016 08:46 IST|Sakshi
నగ్మా అసంతృప్తి

టీనగర్ : విజయధరణికి అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి లభించడంతో నటి నగ్మా అసంతృప్తికి గురయ్యారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా విజయధరణి పనిచేసిన సమయంలో అఖిల భారత కాంగ్రెస్ నిర్వాహకురాలిగా నటి కుష్బూ నియమితులయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలంగోవన్‌కు మద్దతుగా కుష్బూ పనిచేయడంతో ఆమెకు, విజయధరణికి మధ్య  తగాదాలు ఏర్పడ్డాయి. ఇది ఇలావుండగా నటి నగ్మాకు అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిలో నియమించారు. 

దీంతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌లో నగ్మాకు ప్రత్యేకంగా ఒక వర్గం ఏర్పడింది. ఇటీవల రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి విజయధరణి తొలగించిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో దిండుగల్‌కు చెందిన ఝాన్సీరాణి నియమితులయ్యారు. దీంతో తనకు మళ్లీ మహిళా కాంగ్రెస్‌ పదవిలో నియమించాలంటూ విజయధరని ఢిల్లీ అధిష్టానం నేతలను కలసి వారిపై ఒత్తిడి తెచ్చారు.

ఈ నేపథ్యంలో విజయధరణికి మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక చేశారు. నగ్మాకు సాటిగా విజయధరణికి అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి అందజేయడంతో నగ్మా అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు