భువనగిరిలో పింఛనుదారుల నిరసన

12 Dec, 2016 15:11 IST|Sakshi
భువనగిరి: యాదాద్రి జిల్లా భువనగిరిలోని బ్యాంకుల వద్ద పింఛనుదారులు నిరసన తెలిపారు. స్థానిక ఆంధ్రా బ్యాంకు వద్ద ప్రభుత్వ పింఛను దారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు రూ. 10 వేలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయగా రూ. 4 వేలే ఇస్తున్నారని నిరసన తెలిపారు. గంటలకొద్దీ క్యూలైన్లలో తాము నిలబడలేమని, ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రూ.4 వేలతో నెలంతా ఎలా గడపాలని ప్రశ్నించారు. వయోభారంతో ఉన్న తాము బ్యాంకుల చుట్టూ తిరిగి అస్వస్థత పాలైతే ఎవరు బాధ్యులని బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. దీనిపై బ్యాంక్‌మేనేజర్ స్పందిస్తూ ప్రభుత్వం నుంచి అందిన నగదును ఆ నిష్పత్తి మేరకే పెన్షనర్లకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో వృద్ధులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.
మరిన్ని వార్తలు