ఘనంగా శాంతను, కీర్తీల వివాహం

22 Aug, 2015 03:26 IST|Sakshi
ఘనంగా శాంతను, కీర్తీల వివాహం

 తమిళసినిమా; నటుడు శాంతను కీర్తిల వివాహం శుక్రవారం నగరంలో వేడుకగా జరిగింది.సీనియర్ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్, పూర్ణిమ దంపతుల కొడుకు, యువ నటుడు శాంతను, బుల్లితెర వ్యాఖ్యాత కీర్తీల వివాహం చెన్నై సమీపంలోని సముద్రతీర ప్రాంతంలో గల ఇస్కాన్ దేవాలయంలో శుక్రవారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఇరువర్గాల బంధు మిత్రులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
 
  కేంద్ర మంత్రి పొన్‌రాధాక్రిష్ణన్, డీఎంకే మాజీ మంత్రి ఆర్కాడు వీరాసామి, ఐజేకే పార్టీ అధ్యక్షుడు పచ్చముత్తు,తదితర రాజకీయ నాయకులతో పాటు నటుడు విజయ్, పార్తిబన్, కార్తీ, విశాల్, దర్శకుడు హరి, నటుడు విజయకుమార్, నటి జ్యోతిక తదితర చిత్రప్రముఖులు వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు ప్రముఖ నటులు వెంకటేశ్, నరేశ్, మణి రత్నం, సుహాసిని, రేవతి, సుకన్య, ప్రభు హాజరయ్యారు. సాయంత్రం చెన్నై మానగరంలోని శ్రీవారు వెంకటాచలపతి కల్యాణమండపంలో వీరి వివాహ రిసెప్షన్ జరిగింది.
 

మరిన్ని వార్తలు