మూత్ర విసర్జన విషయంలో గొడవ.. విద్యార్థి మృతి

25 Mar, 2017 18:03 IST|Sakshi
బనశంకరి (కర్ణాటక) : మూత్ర విసర్జన విషయంలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈఘటన  బెంగళూరులోని బ్యాడరహళ్లిపోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. నెలమంగల పరిధిలోని సోలూరు ప్రాంతానికి చెందిన రో హిత్‌(20) ఈస్ట్‌వెస్ట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతూ దేవరాజ్‌ అరసు హాస్టల్‌లో ఉంటున్నాడు. ఇదే కాలేజీలో చదువుతున్న అమరేశప్ప, విజయనగర ప్రభుత్వ కళాశాల విద్యార్థి రవీశ్‌లు కూడా అదే హాస్టల్‌లో ఉంటున్నారు.
 
రవీశ్‌ గురువారం రాత్రి మద్యం సే వించి హాస్టల్‌కు చేరుకుని బాత్‌రూమ్‌కు వెళ్లాడు. తలు పు వేసుకోకుండా మూత్రచేస్తుండగా తలుపు వేసుకో వాలని రోహిత్, అమరేశ్‌ సూచించారు. ఈ విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన రవీశ్‌ గదిలోకి వెళ్లి కత్తి తీసుకొని రోహిత్‌ గొంతుపై దాడిచేశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన అమరేశ్‌పై కూడా దాడికి పాల్పడ్డాడు. గాయపడిన ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం రోహిత్‌ను విక్టోరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. హస్టల్‌ వార్డె¯ŒS కేశవగౌడపాటిల్‌ ఇచ్చిన  ఫిర్యాదు మేరకు బ్యాడరహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి రవీశ్‌ను అరెస్ట్‌ చేశారు.  
మరిన్ని వార్తలు