మరో మంత్రికి కరోనా పాజిటివ్‌

10 Jul, 2020 17:47 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. తాజాగా రాష్ట్ర కేబినెట్‌లోని సహకార శాఖ మంత్రి సెల్లూరు కె. రాజుకు శుక్రవారం రోజున కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. దీంతో ఆయన చికిత్స కోసం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. దీనిపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ మాట్లాడుతూ.. మంత్రితో ఫోన్‌లో మాట్లాడానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

అయితే తమిళనాడు కేబినెట్‌లో గతంలో విద్యుత్‌ శాఖ మంత్రి పి. తంగమణి, ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. అన్బళగన్‌కు కరోనా నిర్ధారణ అయ్యింది. తాజాగా సెల్లూర్ కె. రాజుకు కరోనా పాజిటివ్‌ రావడంతో సహచరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా తమిళనాడులో ఇప్పటివరకు ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. 
చదవండి: కరోనా నియంత్రణకు రంగంలోకి కమాండోలు

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు