ఖాకీ దుస్తుల్లో దాగిన కరుణ

21 Nov, 2015 10:47 IST|Sakshi
ఖాకీ దుస్తుల్లో దాగిన కరుణ

బెంగళూరు : పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని ఓ ట్రాఫిక్ ఎస్ఐ తన సమయ స్ఫూర్తితో కాపాడి... ఖాకీ దుస్తుల్లో కూడా కరుణ దాగి ఉంటుందని నిరూపించాడు. బెంగళూరులోని బ్యాటరాయణపుర సర్కిల్ ప్రాంతంలో గురువారం ఉదయం ట్రాఫిక్ ఎస్ఐ గోపాలకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు... ఆ సమయంలో తమిళనాడుకు చెందిన నిండు గర్భిణి సెల్వి అటుగా వెళుతూ పురుటి నొప్పులతో రహదారిపై కుప్పకూలిపోయింది. ఆ విషయాన్ని గమనించిన గోపాలకృష్ణ వెంటనే 108కి ఫోన్ చేశారు.

అయితే ఆ వాహనం రావడం ఆలస్యమైంది. సెల్వికి పురిటి నొప్పులు మరింత ఎక్కువ కావడంతో గోపాలకృష్ణ పరుగుపరుగునా పరిగెత్తి సమీపంలో ఉన్న మహిళా పౌర కార్మికులు స్థానికంగా ఉన్న మహిళలను పిలుకువచ్చారు. అలాగే స్థానికుల నుంచి దుస్తులు సేకరించి... నాలుగు వైపులా కట్టేశారు. అనంతరం స్థానిక మహిళలు సెల్వీకి పురుడు పోశారు.

సెల్వీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. అనంతరం అక్కడకు 108 చేరుకుంది. ఆ వాహనంలో వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. వెంటనే స్పందించి... తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడిన గోపాలకృష్ణను ఉన్నతాధికారులతోపాటు స్థానికులు అభినందించారు.  
 

మరిన్ని వార్తలు