'నేను బతికే ఉన్నా.. వచ్చి కాపాడండి..!'

1 Sep, 2017 09:01 IST|Sakshi
'నేను బతికే ఉన్నా.. వచ్చి కాపాడండి..!'

సాక్షి, ముంబై: ముంబై మహా నగరంలో 117ఏళ్ల పాత భవనం కూలి 34 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఓ హృదయ విదాకర సంఘటన చోటుచేసుకుంది. శిథిలాల్లో చిక్కుకున్న ఓవ్యక్తి సహాయం కోసం ఆర్తనాదం చేశాడు. చివరి ఆ ఆర్తనాదం గాలిలో కలిసిపోయింది. వివరాల్లోకి వెళ్తే జాఫర్‌ రజ్వీ అనే వ్యక్తి కుప్పకూలిన భవనం శిథిలాల్లో చిక్కుకుపోయాడు. సహాయం కోసం ఆర్తనాదం చేశాడు. తన దగ్గర ఉన్న ఫోన్‌లో అత్యవసర సేవ ద్వారా బంధువులకు సందేశం అందించాడు. తాను ఇంకా ప్రాణాలతో ఉన్నానని వచ్చి కాపాడాలని వేడుకున్నాడు.

సమాచారం అందుకున్న బంధువులు శిథిలాల నుంచి స్పృహ తప్పి పడిపోయి ఉన్న జఫ్ఫార్ రజ్వీని బయటకు తీసి దగ్గరలోని జేజే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే రజ్వీ మృతి చెందాడని డాక్టర్లు ప్రకటించారు.  రజ్వీ ఒక్కడే కాదు తనభార్య రేష్మాన్‌, ఇద్దరు పిల్లలతో సహా కుటుంబం మొత్తం ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

జఫ్పార్‌ బంధువు సయ్యద్ సల్మాన్ రజ్వీ మాట్లాడుతూ, తనను కలవడానికి వస్తున్నట్లు ఫోన్‌ చేసి చెప్పాడని అంతలోనే ప్రమాదం జరిగిందని సమాచారం అందిన్నాడు. జఫ్ఫార్‌ నుంచి మెస్సేజ్‌ వచ్చింది. బదులిద్దామంటే జాఫర్ నుండి ఆ తరువాత కమ్యూనికేషన్ లేడన్నాడు.  శిథిలాల నుండి వెలికితీసే సమయానికి జాఫర్‌ అపస్మారక స్థితిలో ఉన్నాడని, దురదృష్టవశాత్తూ జాఫర్‌ను కాపాడుకోలేకపోయం అని సల్మాన్ ఆవేదన చెందాడు.

>
మరిన్ని వార్తలు