నీటి ఏనుగు జననం

7 Jan, 2016 02:06 IST|Sakshi
నీటి ఏనుగు జననం

తిరువొత్తియూరు: చెన్నై, వండలూర్ అరింజ్ఞర్ అన్నా జువాలజికల్ పార్కు నిర్వాహక కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో పార్కులో సంరక్షింపబడుతున్న నాలుగేళ్ల వయసు కలిగిన త్రిష అనే ఆడనీటి ఏనుగు  17వ తేదీ నీటి ఏనుగు పిల్లకు జన్మనిచ్చింది. నీటి ఏనుగు పెరిగిన తరువాతే  లింగబేధం తెలుస్తుందని ఈ పిల్ల నీటి ఏనుగుతో కలిసి పార్కులో మొత్తం 3 మగ, 3 ఆడ నీటి ఏనుగులు ఉన్నట్టు తెలిపారు. ఈ పిల్ల నీటి ఏనుగును బుధవారం నుంచి పర్యాటకులు సందర్శనకు ఉంచినట్టు తెలిపారు.
 

మరిన్ని వార్తలు