అద్భుతాలు-రికార్డులు-ప్రత్యేకతలు

31 Dec, 2014 02:17 IST|Sakshi
అద్భుతాలు-రికార్డులు-ప్రత్యేకతలు

జనవరి :
16 - 231 మంది విద్యార్థులు ఇసైమామణీ ఎంఎస్ మార్టిన్ సారథ్యంలో బోర్డు వాయించి  గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించారు.
23 - మద్యాన్ని వ్యతిరేకిస్తూ చిన్ననగరంలో మద్యం బాటిల్ గొప్పదా, తాళిబొట్టు గొప్పదా తూకం వేస్తూ వినూత్న నిరసన చేపట్టారు.

ఫిబ్రవరి:
2 - చెన్నై మైలాపూర్‌లోని ప్రసిద్ధి గాంచిన కాళవిళియమ్మన్ అమ్మవారి ఆలయానికి 1008 పాల బిందెలతో భక్తులు ఊరేగింపుగా బయలుదేరి కనుల పండుగ చేశారు.
6 - నాగపట్టణం జిల్లా మైలాడుదురైలో చోళుల కాలం నాటి శివాలయం బయటపడింది
ఏప్రిల్:
13 - రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్లమెంట్ అభ్యర్థి సెంగోట్టవన్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు వేలూరు జిల్లా వాణియంబాడి నియోజకవర్గంలోని రెండువేల అడుగుల ఎత్తు గల నెగ్నకొండపైకి ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను దుప్పటిలో కూర్చోబెట్టి కర్రలతో అటవీవాసులు మోసుకె ళ్లారు.
మే:ఙఞ్చట13- విల్లుపురం జిల్లా ఊలందూరుపేట సమీపంలోని కూత్తాండవర్ ఆలయ ఉత్సవాల్లో హిజ్రాలకు వసంతోత్సవం జరిగింది. 13మంది హిజ్రాలకు పెళ్లి జరిగింది.
15 - ప్రముఖ మహిళా చెఫ్ మాల్గుడి కవిత నేతృత్వంలో చెన్నైనగరంలో వెయ్యిమంది వెయ్యి రకాల వంటకాలను తయారు చేసి అలరించారు.ఙఞ్చట20- హోసూరు జిల్లా ఫైవ్‌స్టార్ ఫోరంలో ఒక రక్తపింజేరి పాము ఒకేసారి 35 పిల్లలకు జన్మనిచ్చింది.ఙఞ్చట21- వేలూరు కోట మైదానంలో శునకం పిల్లికి పాలు ఇవ్వటం విశేషం.
జూన్:
20-నన్మంగళం అడవుల్లోని కొండ చరియల్లో అరుదైన యారీషియన్ ఈగిల్ గుడ్లగూబలు సందర్శకులకు కనువిందు చేశారుు.
జూలై:ఙఞ్చట3 - మయన్మార్‌కు చెందిన రెండు నెలల బాలుడికి కావేరి ఆస్పత్రిలో అరుదైన చికిత్స విజయవంతంగా చేశారు.
13 - సెయాస్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయిలో వరుసగా రెండో సారి చాంపియన్‌గా దివేష్ రెడ్డి  నిలిచారు.ఙఞ్చట31- కృష్ణగిరి జిల్లా బూర్గూరు సమీపంలోని కోలనూరు గ్రామానికి చిన్నస్వామి వరి పొలంలో 12 అడుగుల పొడవైన కొండ చిలువను పోలిన నాగుపాము ఐదడుగుల ఎత్తు పడగెత్తి నిలవడం ఆశ్చర్యం కలిగించింది.
ఆగస్టు:ఙఞ్చట3- ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో శిక్షణ పొందిన అభ్యర్థులు తాంబరం ఎయిర్‌ఫోర్స్ శిక్షణ కేంద్రంలో చేసిన ఫైరింగ్, షూటింగ్ విన్యాసాలు అబ్బురపరిచాయి.13- స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ కన్యకాపరమేశ్వరి మహిళా కళాశాలలో యువతులు ఫేస్ పెయింటింగ్స్‌తో ఆకట్టుకున్నారు.ఙఞ్చట17- దెబ్బతింటున్న టైలరింగ్‌ను కాపాడుతూ నగరంలో 30 అడుగుల ఎత్తు, 226 అడుగుల వెడల్పు గల భారీ చొక్కాను తయారు చేసి కనువిందు చేశారు.
28 - తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలోని ఆగ్రా పాళ్యానికి చెందిన శేఖర్, భాను దంపతుల కుమార్తె యువరాణి (12) కంటిలో నుంచి రాళ్లు రావటం వెలుగు చూసింది.
సెప్టెంబరు:ఙఞ్చట 22- బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌ను కలుసుకునేలా పాలం సిల్క్స్ ఆధ్వర్యంలో ది ఇండియా వాల్ శారీ డాన్సు షో కాంపీటీషన్‌ల్లో యువకులు చీరలు కట్టి చిందులు వేశారు.
అక్టోబర్:ఙఞ్చట 2- ది ఫెంట్‌లోప్ ఆధ్వర్యంలో స్థానిక వడపళనిలోని విజయామాల్‌లో వెయ్యి కిలోల భారీ కేక్ ప్రదర్శన జరిగింది. వైరముత్తు రాసిన పాటల చిత్రాల ఫొటోలతో ఆకట్టుకున్నారు.ఙఞ్చట 11- వేలూరు జిల్లా వాలాజాలోని శ్రీ ధన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాధిపతి డాక్టర్ మురళిధరస్వామి 55వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని లక్ష నెల్లికాయలతో యాగం చేశారు.
నవంబర్:
 1 - ప్రపంచంలోని కట్టడాలను నగరానికి చెందిన చిన్నారులు అట్టముక్కలు, థర్మాకోల్‌తో తాజ్‌మహల్, గేట్‌వే ఆఫ్ ఇండియా, చార్మినార్ నమూనాలను తయారు చేసి అబ్బుర పరిచారు.
5 - మతిస్థిమితం లేని ఓ మహిళ బైకు కింద పడి గాయాల పాలైన కుక్కపిల్లను అక్కున చేర్చుకుని మాతృప్రేమను చాటిన అరుదైన సంఘటన మానవత్వాన్ని పరిమళింప చేసింది.ఙఞ్చట14- బాలల దినోత్సవాన్ని చాచా నెహ్రూకు జేజేలు పలుకుతూ స్థానిక చూలైలోని సెయింట్ జోసఫ్ బాలికల మహోన్నత పాఠశాలల్లో విద్యార్థులు నెహ్రూ ముఖ ఆకారంలో నిలుచుని కనువిందు చేశారు.ఙఞ్చట20- ప్రమాదంలో గాయపడి కొన ఊపిరితో ఉన్న ఓ కార్మికుడికి స్థానికంగా ఉన్న గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు గుండెకు అరుదైన చికిత్స అందించి పునర్జన్మ అందించారు.
స్థానిక కేకే నగర్‌కు చెందిన కెఎల్ ధీరజ్ (05) ప్రపంచంలోని 79 దేశాల జాతీయ పతాకాలను నిమిషం వ్యవధిలో గుర్తించి గిన్నిస్ రికార్డులోకి ఎక్కి చరిత్ర సృష్టించాడు.
డిసెంబర్:  ఎగ్మూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన రెండు రోజుల బిడ్డకు నోటిలోని 50 గ్రాముల గడ్డను అరుదైన శస్త్ర చికిత్సతో వైద్యులు తొలగించారు. మాతృదేవోభవ పూజలో మాతృమూర్తులకు కాళ్లు కడిగి తల్లి రుణం తీర్చుకున్న సంఘటన మానవత్వాన్ని చాటింది.
24 - క్రిస్మస్‌ను పురస్కరించుకుని నగరంలో ఓ బేకరీ దుకాణంలో మదురై ధర్మాసనం ఆకారంలో 8 అడుగుల పొడవు, 4 అడుగుల ఎత్తుతో 350 కిలోల బరువుగల కేక్‌ను తయారు చేశారు.
 

మరిన్ని వార్తలు