నిన్న సస్పెన్షన్.... రేపు రిటైర్మెంట్

29 Jun, 2014 09:44 IST|Sakshi
నిన్న సస్పెన్షన్.... రేపు రిటైర్మెంట్

 చెన్నై, సాక్షి ప్రతినిధి:  1985లో జైలువార్డన్‌గా విధుల్లో చేరిన చేరిన గోవిందరాజ్ అంచలంచెలుగా ఉన్నతాధికారిగా ఎదిగారు. సుదీర్ఘకాలం పదోన్నతికి నోచుకోని ఆయనకు 2009లో డీఐజీగా ఒక్కసారిగా పదోన్నతి లభించింది. ఆరేళ్లుగా అదే హోదాలో కొనసాగుతున్న గోవిందరాజ్ ప్రస్తుతం కోవైలోని సెంట్రల్‌జైలు డీఐజీగా  బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జైలులో గంజార, హెరాయిన్ తదితర నిషేధిత మత్తుపదార్థాలతోపాటూ ఖైదీలకు సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు, చార్జర్లు యథేచ్ఛగా సరఫరా సాగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా సీబీసీఐడీతో విచారణ జరి పించగా ఆరోపణలు రుజువయ్యూయి. డీఐజీ గోవిందరాజ్‌తోపాటూ మరో 17 మంది జైలు అధికారులు, సిబ్బంది ప్రమేయంతోనే మత్తుపదార్థాలు సరఫరా అయినట్లు సీబీసీఐడీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో డీఐజీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
 
 నిర్దోషిని
 సీబీసీఐడీ పోలీసులు ఇచ్చిన నివేదిక తనను దోషిగా పేర్కొన్నా, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని గోవిందరాజ్ పేర్కొన్నారు. తన 30 ఏళ్ల సర్వీసుల్లో ఎన్నడూ ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొనలేదని అన్నారు. తనతోపాటూ మరో 17 మంది అధికారులను సీబీసీఐడీ తప్పుపట్టినా తనను మాత్రమే సస్పెండ్ చేయడం బాధాకరమని అన్నారు. మరో రెండు రోజుల్లో ఉద్యోగ విరమణ చేస్తున్న తరుణంలో ప్రభుత్వం ఇటువంటి చర్యకు పాల్పడటం తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు