ఖైదీలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి.. జైళ్ల శాఖ డీఐజీ

7 Nov, 2023 11:41 IST|Sakshi
జిల్లా కేంద్రంలోని జైల్‌లో ఖైదీలతో మాట్లాడుతున్న డీఐజీ శ్రీనివాస్‌

నల్లగొండ క్రైం: సమాజానికి తోడ్పాటునిచ్చేలా జైళ్లలో ఉన్న ఖైదీలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని జైళ్ల శాఖ డీఐజీ డి.శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం ఆయన నల్లగొండలోని జిల్లా జైల్‌ను సందర్శిం చారు. ఈ సందర్భంగా జైల్‌ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

జైలు సిబ్బంది సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ జైలు నుంచి విడుదలైన తర్వాత మంచి పౌరులుగా మారి సమాజంలో గౌరంగా జీవనం సాగించాలని కోరారు. కార్యక్రమంలో జైల్‌ సూపరింటెండెంట్‌ దేవ్‌లానాయక్‌, జైలర్‌ జనార్దన్‌రెడ్డి, డీఎస్పీ శోభన్‌బాబు, రామలింగం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు