మిర్యాలగూడ జిల్లా కోసం యువకుల హల్చల్

6 Oct, 2016 12:19 IST|Sakshi
మిర్యాలగూడ అర్బన్ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ నలుగురు యువకులు హల్ చల్ చేశారు. మిర్యాల గూడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న మూడంస్తుల బిల్డింగ్ ఎక్కి కిందకు దూకుతామని హెచ్చరిస్తున్నారు. స్థానికులు సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు వారితో చర్చలు జరిపి కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని వార్తలు