'సభలో నేను ఉండకూడదని చంద్రబాబు కుట్ర'

22 Dec, 2016 14:08 IST|Sakshi
'సభలో నేను ఉండకూడదని చంద్రబాబు కుట్ర'

హైదరాబాద్‌: ఏపీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం నుంచి వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వాకౌట్‌ చేశారు. విచారణ జరగకుండానే తాను తప్పు చేసినట్లు ఎలా చెబుతారంటూ అంతకు ముందు ఆయన ప్రివిలేజ్‌ కమిటీ సమావేశంలో వాదించారు. కమిటీ సభ్యులు రామకృష్ణ, శ్రవణ్‌ను చెవిరెడ్డి నిలదీశారు.

వీడియో క్లిప్పుంగుల్లో తాను తప్పు చేసినట్లు ఎక్కడా లేదని ఆయన ఈ సందర్భంగా వారితో అన్నారు. సభ నుంచి తనను సస్పెండ్ చేయాలని ముందే నిర్ణయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రివిలేజ్‌ కమిటీనే కావాలని సభ్యుల హక్కులను కాలరాస్తోంది ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తాను ఉండనే కూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని చెవిరెడ్డి చెప్పారు.