మీ ఫోన్లో ’ఏఐ‘ ఉందా.?!

11 Sep, 2017 11:37 IST|Sakshi
మీ ఫోన్లో ’ఏఐ‘ ఉందా.?!

సాక్షి, న్యూఢిల్లీ : బైక్‌మీద ప్రయాణిస్తున్నా.. కార్‌లో డ్రైవింగ్‌ చేస్తున్నా.. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ ఇప్పుడు చాలా కామన్‌గా మారింది. అనేక ప్రమాదాలకు సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కూడా కారణమవుతోంది. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ ప్రమాదాలను నివారించేందుకు కెనడాలోని వాటర్లు వర్సిటీ పరిశోధకులు కొత్త సాప్ట్‌వేర్‌ని అభివృద్ధి పరిచారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌గా (ఏఐ)గా పిలిచే ఈ కొత్త కొత్త టెక్నాలజీని మొబైల్‌ లోని కెమెరాకు అనుసంధానం చేస్తారు. ఈ టెక్నాలజీ డ్రైవింగ్‌ చేసే సమయంలో మన చేతుల కదలికలను నిరంతరనం గురిస్తాయి.  కదలికల్లో అనుమానం వస్తే.. వెంటనే మనల్ని అలెర్ట్‌ చేస్తుంది. ఈ టెక్నాలజీని అడ్వాన్స్‌డ్‌ సెల్ప్‌ డ్రైవింగ్‌ కార్లలో ఉపయోగించేందుకు అభివృద్ధి చేసినా..  సెలఫోన్‌ డ్రైవింగ్‌ ప్రమాదాలు భారీగా పెరుగుతుండడంతో.. అందరూ ఉపయోగించుకునేందుకు అనువుగా మార్చామని.. ప్రొఫెసర్‌ ఫాఖరి క్యారీ చెప్పారు.

హృదయ ప్రతిస్పందనలు, చేతుల కదలికల్లో ఒత్తిడి, ఆందోళనలను కూడా గుర్తించేలా అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు. డ్రైవింగ్‌ చేసే సమయం‍లో ఒత్తిడికి గురైనా.. ఇతరులతో సీరియస్‌గా మాట్లాడుతున్నా.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గుర్తించి.. మిమ్మిల్ని అలెర్ట్‌ చేస్తుందని క్యారీ చెబుతున్నారు.  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని వినియోగించడం వల్ల 75 శాతం ప్రమాదాలను నివారించవచ్చని క్యారీ చెప్పారు.
 

మరిన్ని వార్తలు