ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్స్... ఏంటవి?

24 Apr, 2017 19:40 IST|Sakshi
ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్స్... ఏంటవి?
జియో ఎంట్రీతో మొదలైన టెలికాం ఇండస్ట్రీలో బ్రాడు బ్యాండ్ స్పీడు, డేటా, కాలింగ్ ప్లాన్స్ లో వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ మరోసారి తన పోస్టు పెయిడ్ కస్టమర్ల ప్లాన్స్ ను సవరించింది.  ప్రస్తుతం సవరించిన ప్లాన్స్ మైప్లాన్ ఇన్ఫీనిటీ కింద  దేశవ్యాప్తంగా ఇన్ కమింగ్ కాల్స్ కు ఉచిత రోమింగ్ ప్రయోజనాలను అందించనుంది. 
రూ.299 ప్లాన్...
అన్ని కనెక్షన్లకు 680 నిమిషాల లోకల్, ఎస్టీడీ కాల్స్ తో పాటు, 600 ఎంబీ 4జీ డేటాను కంపెనీ ఈ బిల్లింగ్ సైకిల్ లో ఆఫర్ చేయనుంది.
రూ.399 ప్లాన్...
ఉచిత లోకల్, ఎస్టీడీ కాల్స్ నిమిషాలను కంపెనీ 765కు పెంచింది. డేటా వాడకం కూడా ఈ బిల్లింగ్ సైకిల్ లో 1జీబీకి పెంచింది. ఈ రెండు ప్యాక్ ఆఫర్స్ కింద కంపెనీ ఉచిత రోమింగ్ ఇన్కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని అందించనుంది. అవుట్ గోయింగ్ లోకల్ కాల్స్ కు నిమిషానికి 80 పైసలను వసూలు చేయనుంది. అదే అవుట్ గోయింగ్ ఎస్టీడీ కాల్స్ కైతే, నిమిషానికి 1.15పైసల ఛార్జీ వేయనుంది.
  
స్పీడ్ టెస్ట్ సర్వీసుల తనకు ఫాస్టెస్ట్ నెట్ వర్క్ అనే టైటిల్ ఇచ్చిన సందర్భంగా కంపెనీ తన పోస్టు పెయిడ్ కస్టమర్లకు 6జీబీ నుంచి 30జీబీ డేటా ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మై ఎయిర్ టెల్ యాప్ ద్వారా ఏప్రిల్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.  అయితే ఈ కొత్త ప్లాన్స్ లో కంపెనీ అపరిమిత ప్రయోజనాలను కల్పించడం లేదు. 499 ప్లాన్ కిందనైతే, కంపెనీ అపరిమిత ఎస్టీడీ, లోకల్ కాల్స్, 3జీబీ 4జీ డేటాను వంటివాటిని పొందవచ్చు.
 
మరిన్ని వార్తలు