117 కిలోల గంజాయి పట్టివేత

11 Aug, 2018 03:00 IST|Sakshi

రైల్వేగేట్‌: వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం వేర్వే రుగా రైళ్లలో తరలిస్తున్న గంజాయి అక్రమ రవాణా ముఠాలను జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్‌ డివిజినల్‌ రైల్వే ఎస్పీ జి.అశోక్‌కుమార్‌ కథనం ప్రకారం.. హర్యానాలోని ప్రీతినగర్‌ పంచ్‌కులవాసులు గీతా బౌరి, పూజ బౌరీ, కమలా బగిడి, గంగా బౌరీలు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో హ్యాండ్‌ బ్యాగుల్లో 75 కిలోల ఎండు గం జాయి ప్యాకెట్లు తరలిస్తుండగా వరంగల్‌ స్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు.

మరో ఘటనలో ఒడిశా లోని కోరాపుట్‌ జిల్లా కులార్‌సింగ్‌ ప్రాంతానికి చెం దిన బిస్వంత్‌ సేతీ, మిరా సేతీ, రాజు సేతీ, పునమా ముత్యం ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ 42 కిలోల ఎండు గం జాయిని తరలిస్తూ వరంగల్‌ స్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు. వీరందరూ కూలీలని, ఈ రెండు కేసుల్లో మొత్తం 8 మందిని అరెస్ట్‌ చేశామని, ఇందులో ఆరుగురు మహిళలున్నట్లు పేర్కొన్నారు. వీరి వద్ద 117 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు