గొర్రెల కోసం 4 రాష్ట్రాలకు 14 బృందాలు

2 Feb, 2017 02:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గొర్రెల కాపరులకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో పశుసంవర్థకశాఖ దీనిపై కసరత్తు ప్రారంభించింది. గొర్రె పిల్లలను ఎక్కడ సేకరించాలో సమాచారం తెలుసుకునేందుకు 14 బృందాలను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు పంపినట్లు ఆ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు.

మొత్తం 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ బృందాలు సమగ్రంగా అధ్యయనం చేసి కొనుగోలు అవకాశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి. రాష్ట్రంలో నెల్లూరు బ్రౌన్  రకం గొర్రెలు పెంచేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ రకం గొర్రెల కోసం అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా