ఆలయాల్లో తవ్వకాలు: నలుగురి అరెస్టు

7 Oct, 2015 12:46 IST|Sakshi

హుస్నాబాద్: శిథిలావస్థలో ఉన్న పురాతన ఆలయాల్లో గుప్తనిధుల కోసం కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామ సమీపంలోని బయ్యన్నగుట్టలో మంగళవారం అర్ధరాత్రి కొందరు తవ్వకాలు జరుపుతుండగా చప్పుళ్లు వస్తుండటంతో.. పంట కాపలా కోసం వచ్చిన రైతులు ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తవ్వకాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు