సిగరెట్‌ వ్యర్థాల పునర్వినియోగం

9 Jul, 2019 10:32 IST|Sakshi
పబ్లిక్‌ యాష్‌ ట్రేను ఆవిష్కరిస్తున్న వర్థమాన నటీనటులు శ్రీజిత, వాసుదేవ్‌

అజిస్టా సంస్థ కృషి  

జూబ్లీహిల్స్‌: సిగరెట్‌ తాగేవారి ప్రాణాలకు ముప్పుతెస్తుంది. కేన్సర్‌ ప్రాణాంతక వ్యాధులను వెంటతెస్తుంది. దీంతోపాటే తాగిపారేసే సిగరెట్‌ పీకలు భూమిలోకి చేరి పర్యావరణానికి ఎసరుపెడుతున్నా యి. పీకల్లోని ప్రమాదకరమైన కాడియం, ఆర్సెనిక్‌ కెమికల్స్‌ భూమిలోకి చేరి భూమి ని, నీటిని కలుషితం చేస్తున్నాయి. సిగరెట్లు, సిగరెట్‌ పీకలను సమర్థవంతంగా పునర్వినియోగం చేయడం ద్వారా కొంతమేర పర్యావరణానికి మేలు చేయడానికి నగరానికి చెందిన ఔత్సాహిక స్టార్టప్‌ అజిస్టా కొత్త ప్రయత్నం చేస్తుంది.

తాగిపారేసే సిగరెట్లను సేకరించి వాటిని పునర్‌ వినియోగం చేయడమే లక్ష్యంగా వినూత్నమైన పరిష్కారంతో ముందుకొచ్చింది. ఈమేరకు ‘క్విక్‌మింట్‌ ’ పేరుతో పబ్లిక్‌ యాష్‌ట్రే బాక్సులను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ప్రథమ ప్రయత్నంగా జూబ్లీహిల్స్‌లోని ఓ పాన్‌షాప్‌లో ఏర్పాటు చేసిన పబ్లిక్‌ యాష్‌ ట్రేను వర్థమాన నటీనటులు శ్రీజిత, వాసుదేవ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్బం గా అజిస్టా ప్రతినిధి అభిషేక్‌ మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్,  స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా  నగరవ్యాప్తంగా దాదాపు 400 యాష్‌ ట్రేబిన్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. వారానికి ఒకసారి తమ సంస్థ ప్రతినిధులు యాష్‌ట్రేల నుంచి సిగరెట్‌ పీకలు సేకరించి పునర్వినియోగం కొరకు వినియోగిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు