స్కూళ్ల అకడమిక్ కేలండర్ ఇదే!

9 Jun, 2016 01:31 IST|Sakshi
  • మార్చి మొదటివారంలోనే టెన్త్ పరీక్షలు
  • మార్చి 21 నుంచే కొత్త విద్యా సంవత్సరం షురూ
  •  

    సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల తర్వాత ఈ నెల 13 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో అమలు చేయాల్సిన విద్యా కార్యక్రమాలు, పరీక్షల నిర్వహణ, సెలవులకు సంబంధించిన సమగ్ర వివరాలతో విద్యాశాఖ బుధవారం అకడమిక్ కేలండర్‌ను ప్రకటించింది. పాఠశాలల్లో ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని డీఈవోలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలలో చేపట్టాల్సిన కార్యాచరణను పంపించింది. దీని ప్రకారం ఈ నెల 13 నుంచి 2017 ఫిబ్రవరి 28 వరకు స్కూళ్లలో పాఠాలను బోధించాలి. పదోతరగతికి మాత్రం ఈ నెల 13న పాఠ్యాంశాల బోధన చేపట్టి వచ్చే ఏడాది జనవరి 31 నాటికి పూర్తి చేయాలి.

     

    • స్కూళ్ల పని వేళలు ఇలా..
    •   ఉన్నత పాఠశాలలు: ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు. రోజుకు 7 గంటల 15 నిమిషాలు కొనసాగాలి
    •   ప్రాథమికోన్నత పాఠశాలలు: ఆరు నుంచి 8వ తరగతి వరకు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు(7 గంటల 15 నిమిషాలు) పని చేయాలి
    •   ప్రాథమిక పాఠ శాలలు, వాటిలోని అప్పర్ ప్రైమరీ సెక్షన్లు: ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు(ఏడు గంటలు) పని చేయాలి

    పరీక్షల షెడ్యూలు ఇదీ..

    •   ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ)-1: పని దినాలు 39 రోజులు. జూలై 30వరకు బోధించి, పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థుల సామర్థ్యాలను రిజిస్టర్ చేయాలి
    •   ఫార్మేటివ్-2: 41 రోజుల పనిదినాలు. సెప్టెంబర్ 22లోగా పరీక్షలు నిర్వహించాలి. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 22 వరకు పని చేయాలి. సెప్టెంబర్ 22లోగా పరీక్షలు నిర్వహించి, సామర్థ్యాలను రికార్డు చేయాలి
    •   సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ)-1 (త్రైమాసిక పరీక్షలు): అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించాలి. విద్యార్థులకు జవాబు పత్రాలను ఇవ్వాలి. ఫలితాలను నవంబర్ 7న ప్రకటించాలి. ఫలితాలను నవంబర్ 10 వరకు రికార్డు చేయాలి. 11న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలి.
    •   ఎఫ్‌ఏ-3: అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 9 వరకు. 57 పని దినాలు. డిసెంబర్ 9లోగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను నమోదు చేయాలి
    •   ఎఫ్‌ఏ-4: ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వారికి 2017 ఫిబ్రవరి 20 వరకు. పదో తరగతి వారికి ఫిబ్రవరి 4 వరకు మొత్తంగా 52 రోజులు పని చేయాలి. విద్యార్థుల సామర్థ్యాలు రిజిస్టర్ చేయాలి.
    •   ఎస్‌ఏ-2: వచ్చే ఏడాది మార్చి 7 నుంచి 15 వరకు ఒకటి నుంచి 9 తరగతులకు వార్షిక పరీక్షలు. మార్చి 19న విద్యార్థులకు జవాబు పత్రాలు ఇవ్వాలి. ఫలితాలను రికార్డు చేయాలి. 20న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి. - 2017 ఫిబ్రవరి 6 నుంచి 18 వరకు: పదో తరగతి వారికి ప్రీ ఫైనల్ పరీక్షలు. మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు.

     క్రీడలు..

     ఆగస్టు 5లోగా పాఠశాల స్థాయిలో నిర్వహించాలి. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 5 వరకు మండల/డివిజన్ స్థాయిలో, సెప్టెంబర్ 8 నుంచి 20 వరకు జిల్లా స్థాయిలో నిర్వహించాలి. ఎంపికైన విద్యార్థులను సెప్టెంబర్/అక్టోబర్‌లో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల పోటీలకు పంపించాలి.

మరిన్ని వార్తలు