బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేద్దాం

13 Jun, 2018 09:22 IST|Sakshi
పోస్టర్‌ను విడుదల చేస్తున్న హోంమంత్రి నాయిని, చిత్రంలో ఆండ్రూ ఫ్లెమింగ్‌ తదితరులు 

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి

జూబ్లీహిల్స్‌: రాష్ట్రంలో బాలకార్మిక వ్వసస్థను సంపూర్ణంగా నిర్మూలించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, వచ్చే 2021 సంవత్సరంలోపు అది పూర్తవుతుందని రాష్ట్ర హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వం స్వచ్ఛద సంస్థలు, ప్రజలు, ప్రజా ప్రతిని«ధులతో కలిసి పనిచేస్తుందన్నారు.

ప్రపంచ బాలకార్మిక నిర్మూలన రోజును పురస్కరించుకొని మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ, ప్లాన్‌ ఇండియా, మహిత స్వచ్ఛద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బేగంపేట సెస్‌ ఆడిటోరియంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ..

బాలకార్మిక వ్వవస్థకు ప్రధానంగా పేదరికమే కారణమని, గ్రామాల్లో పేదరికం నిర్మూలిస్తే చాలా వరకు సమస్య పరిష్కారమవుతుందన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు చొరవ తీసుకొని పిల్లలను బడికి పంపేలా చూడాలన్నారు. నగరంలోని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ..

ప్రభుత్వంతో పాటు స్వచ్ఛద సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బాలకార్మిక నిర్మూలనకు చేపట్టిన చర్యలు వివరిస్తూ ‘ఏ జర్నీ టు క్రియేట్‌ చైల్డ్‌ లేబర్‌ ఫ్రీ తెలంగాణ విత్‌ ఎన్‌జీఓ పార్టిసిపేషన్‌’ పేరుతో రూపొందించిన టేబుల్‌ బుక్‌ను, బాల కార్మిక వ్యతిరేక ప్రచారంతో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ప్లాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ అనితాకుమార్, మహిత డైరెక్టర్‌ రమేష్‌శేఖర్‌రెడ్డి, కార్మికశాఖ ఎస్‌ఆర్‌సీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ వర్షాభార్గవ, పలు జిల్లాలకు చెందిన సర్పంచ్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు