భారీగా పెరిగిన మద్యం ధరలు

16 Dec, 2019 20:01 IST|Sakshi

పదిశాతం పెరిగిన మద్యం ధరలు

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సంవత్సర వేడుకలకు ముందు మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై పదిశాతం ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్వార్టర్‌పై రూ.20, హాఫ్‌పై రూ.40, ఫుల్‌పై రూ.80 పెంచుతున్నట్లు అబ్కారీశాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పెరిగిన ధరలు రేపటి నుంచి (మంగళవారం) అమల్లోకి రానున్నాయి. పాత మద్యం నిల్వలకు కొత్త ధరల పెంపు వర్తించదని ఎక్సైజ్‌శాఖ తెలిపింది. పెరిగిన ధరలతో ప్రభుత్వానికి రూ.300 నుంచి రూ.400 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు