మద్యం తరలిస్తున్న కారుకు ప్రమాదం, ఎగబడిన జనం: వైరల్ వీడియో

1 Nov, 2023 12:41 IST|Sakshi

 ‘మెడిసిన్‌’ పేరుతో  మద్యాన్ని అక్రమ తరలిస్తుండగా ప్రమాదం జరిగింది.దీంతో మద్యం బాటిళ్లను దక్కించుకునేందుకు జనం ఎగబడ్డారు. దొరికింది దొరికినట్టు తీసుకుని పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.   అక్టోబరు 30న  బిహార్‌లోని జాతీయ రహదారి- 2పై   ఈ ఘటన చోటు చేసుకుంది.

రాష్ట్రంలో 2016, ఏప్రిల్ 5 నుంచి మద్య నిషేధం అమల్లో ఉంది. ఈ  నేపథ్యంలో అక్కడ మద్యం అక్రమ రవాణాకు తెరతీసింది. మెడిసిన్‌ పేరుతో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. మితిమీరిన వేగంతో ఉన్న ఈ వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో సాయం చేసేందుకు వచ్చిన స్థానికులు కారులో ఉన్న దాన్ని చూసి షాకయ్యారు. అంతే ఒక్కసారిగా అక్కడ గలాటా మొదలైంది. మద్యం బాటిళ్లను దొరకబుచ్చుకుని పరుగు అందున్నారు.

ఫలితంగా అక్కడ ట్రాఫిక్‌ స్థంభించి, గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. కానీ అప్పటికే కారులో ఉన్న నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మద్యం బాటిళ్లను అక్రమంగా తరవాటిని తీసుకెళ్లిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ్ ప్రకాశ్ వెల్లడించారు. మొత్తం సరుకును స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు  స్థానికి అధికారి చెప్పారు.

మరిన్ని వార్తలు