కుక్కను కాపాడి.. ఆకలి తీర్చి

23 Sep, 2019 13:22 IST|Sakshi

బంజారాహిల్స్‌: బిజీ రోడ్డులో ఓ కుక్క పిల్ల రోడ్డు దాటుతూ కారు చక్రాల కింద పడే క్రమంలో అటుగా వెళ్తున్న బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ సతీమణి వ్యాన్‌ ఫ్లెమింగ్‌ తన కారును ఆపి హుటాహుటిన అక్కడికెళ్లి కుక్కను ప్రమాదం నుంచి కాపాడారు. దీన్ని ఆమె ట్విట్టర్‌లో పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ఆమె తన కారులో వెళ్తుండగా రోడ్డు పక్క నుంచి ఓ కుక్కపిల్ల అటువైపు వెళ్తుండగా ఓ వాహనం దానిపై నుంచి వెళ్లే క్రమంలో తప్పించుకుంది. ఇది గమనించిన ఫ్లెమింగ్‌ తన కారును ఆపి అంత రద్దీలోనూ రోడ్డు దాటి కుక్కపిల్లను పట్టుకొని అక్కడ చెరుకు రసం అమ్ముతున్న వ్యాపారి నుంచి నీళ్లు తీసుకొని దానికి తాగించారు. తర్వాత కొద్ది దూరంలో ఉన్న ఫార్మసీలో డాగ్‌ఫీడ్‌ను తీసుకొచ్చి తినిపించారు. దాంతో గంటపాటు సరదాగా గడిపారు. ‘మీరు వీధి కుక్కలను దత్తత తీసుకోకపోయినా పర్వాలేదు. కానీ మూగజీవాల పట్ల కొంత ప్రేమను చూపండి’ అంటూ ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు