అన్నపూర్ణ స్టూడియోకు బ్యాంకు నోటీసులు

24 Mar, 2015 02:34 IST|Sakshi

హైదరాబాద్: తమ వద్ద రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని అన్నపూర్ణ స్టూడియోకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు రెండు జాతీయ బ్యాంకులు సోమవారం నోటీసులు జారీ చేశాయి. బంజారాహిల్స్ రోడ్ నం 2లోని అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం ఇండియన్ బ్యాంక్‌కు రూ.32,30,60,281 కోట్లు, ఆంధ్రాబ్యాంకుకు రూ.29,76,70,292 కోట్లు బకాయి పడింది. 2014 జనవరి 2న డిమాండ్ నోటీసులు జారీ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో అన్నపూర్ణ స్టూడియో కార్యాలయంలో నోటీసులను అందజేశారు. అన్నపూర్ణ స్టూడియోకు చెందిన ఆస్తులు తమ స్వాధీనంలో ఉన్నాయని వీటిపై ఎవరూ ఎలాంటి లావాదేవీలు జరపవద్దని నోటీసుల్లో హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు