డిస్మిస్డ్‌ కార్మికులకు  ‘ఒక్క అవకాశం’

21 Sep, 2019 02:05 IST|Sakshi

గుర్తింపు కార్మిక సంఘం, సింగరేణి మధ్య ఒప్పందం 

356 మంది కార్మికులకు తిరిగి లభించనున్న ఉద్యోగాలు

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి బొగ్గు గనుల సంస్థల్లో పలు కారణాలతో డిస్మిసైన ఉద్యోగులకు ‘ఒక్క అవకాశం’లభించింది. మళ్లీ కొలువుల్లో చేరేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు సింగరేణి సంస్థ యాజమాన్యం, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. 2000–18 మధ్య కాలంలో డిస్మిసైన 356 మంది కార్మికులు తిరిగి ఉద్యోగాలు పొందనున్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో శుక్రవారం సంస్థ డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు బి.వెంకట్రావు సమక్షంలో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. గుర్తింపు సంఘం ఈ విషయాన్ని పలుమార్లు యాజమాన్యం, సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లింది. సీఎం సానుకూలంగా స్పందించడంతో ఒప్పందానికి మార్గం ఏర్పడింది. దీర్ఘకాలంగా గైర్హాజరు, అనారోగ్య కారణాల వల్ల విధులకు హాజరుకాకపోవడంతో ఈ కార్మికులను సంస్థ అప్పట్లో తొలగించింది.

మరిన్ని వార్తలు