కేసీఆర్ ఇక అక్కడే ఉండిపోతారు: ఖర్గే

17 Nov, 2023 15:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో అని, ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ  సందర్భంగా మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు.

‘‘కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుంది. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నది. మోదీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం జనాలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. ఎప్పుడూ ఫామ్‌ హౌస్‌లోనే ఉండే కేసీఆర్ ఇక అక్కడే ఉండిపోతారు. జనాలు బై బై కేసీఆర్ టాటా కేసీఆర్ అంటారు. విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చారు. జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలుతున్నారు’’ అంటూ ఖర్గే మండిపడ్డారు.

ప్రాజెక్టులు, పథకాలు ప్రతి దాంట్లోనూ అవినీతి. తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తొలిరోజే వాటిపై నిర్ణయం తీసుకుంటాం’ అని ఖర్గే పేర్కొన్నారు.
చదవండి: తెలంగాణ: కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల 

మరిన్ని వార్తలు