బాలలను పనిలో పెట్టుకుంటే మూడేళ్ల జైలు

24 Jul, 2016 04:45 IST|Sakshi
బాలలను పనిలో పెట్టుకుంటే మూడేళ్ల జైలు

- 14 ఏళ్లలోపు వారిని పనిలో పెట్టుకుంటే రూ.50 వేల జరిమానా
- ప్రమాదకర పరిశ్రమల్లో 18 లోపు వారు పనిచేయడం నిషేధం
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ
 
 సాక్షి, హైదరాబాద్: బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా అరికట్టడం కోసం ‘చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్ యాక్ట్’ తీసుకొచ్చినట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఇకపై 14 ఏళ్ల లోపు వారిని పనిలో పెట్టుకుంటే మూడేళ్ల జైలుతో పాటు రూ.50 వేల జరిమానా విధిం చనున్నట్లు తెలిపారు. 18 ఏళ్ల లోపు వారు ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేయడానికి వీల్లేకుండా నిషేధం విధిం చినట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐసీ రీజనల్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. బాల కార్మిక చట్టం పార్లమెంట్‌లో ఆమోదం పొందడం  సంతోషంగా ఉందన్నారు. దీని ద్వారా 14 ఏళ్లలోపు వారిని పనిలో పెట్టుకోవడాన్ని పూర్తిగా నిషేధించి నట్లు చెప్పారు.

వారి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో నిర్వహించే చిన్న చిన్న ఎంటర్‌ప్రైజెస్‌లలో మాత్రం బడి వేళ లు ముగిశాక సహాయంగా పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా పిల్లల స్కిల్ డెవలప్ అయ్యే అవకాశం ఉంద న్నారు. ఈ చట్టం విద్యాహక్కు చట్టానికి సమానంగా ఉం టుందన్నారు. బాల కార్మికులను గుర్తించిన వెంటనే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం వారికి పునరావాసం కింద రూ.15 వేలు బ్యాంకు అకౌం ట్‌లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. త్వరలో మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందన్నారు. దీంతో గర్భిణీలకు 6 నెలల వేతనంతో కూడిన సెలవు మంజూరు అవుతుందన్నారు. మిషన్ కాకతీయకు కేంద్రం రూ.150 కోట్లు మంజూరు చేసినట్లు  తెలిపారు.

మరిన్ని వార్తలు