‘భగీరథ’ పనుల్లో అలసత్వం వద్దు

14 Feb, 2016 02:37 IST|Sakshi
‘భగీరథ’ పనుల్లో అలసత్వం వద్దు

 ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్

 సాక్షి నెట్‌వర్క్: మిషన్ భగీరథ పనుల్లో అలసత్వం వీడాలని ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులకు సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి, ఆమనగల్లు, నాగర్‌కర్నూల్, గోపాల్‌పేటలలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను ఆమె రెండోరోజు శనివారం పరిశీలించారు. కల్వకురిలో పథకం పనులను ఆమెతోపాటు కలెక్టర్ టీకే శ్రీదేవి పరిశీలించారు. మూడేళ్లలో పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.ఆమనగల్లు మండలంలో భగీరథ పనులకు అడ్డుచెప్పిన అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి వద్ద జరుగుతున్న మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ థర్డ్ లిఫ్ట్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.  

 రైతుల అభ్యంతరం: గోపాల్‌పేట మండలం నాగపూర్ శివారులో సంప్‌హౌస్ నిర్మాణానికి సంబంధించి భూమి కోల్పోయిన రైతులు అభ్యంతరం తెలిపారు. స్మితాసబర్వాల్ స్థల పరిశీలన చేసి వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులకు చెప్పారు. ఆమె వెళ్లిపోయాక పలువురు రైతులు తమకు నష్టపరిహారం తేల్చకుండా పనులు ప్రారంభిస్తే ఒప్పుకునేది లేదని తెలిపారు. వారితో ఆర్డీఓ రాంచందర్ మాట్లాడి పూర్తిస్థాయిలో పరిహారం ఇస్తామని చెప్పి నచ్చజెప్పారు.

>
మరిన్ని వార్తలు