పాముకాటుతో అటెండర్‌ మానస మృతి

28 Sep, 2023 11:53 IST|Sakshi

వరంగల్ :పాముకాటుతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన నర్సంపేట మండలం మహేశ్వరంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బండి మానస (30) నర్సంపేట మిషన్‌భగీరథ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 14వ తేదీన సాయంత్రం ఇంట్లో పని చేస్తున్న క్రమంలో మానసను పాము కాటు వేసింది. దీంతో వెంటనే వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శీలం రవి తెలిపారు.  

మరిన్ని వార్తలు