ఆస్తి పన్ను వివాదంలో బైంసా వ్యవసాయ మార్కెట్

5 Feb, 2015 19:03 IST|Sakshi

ఆదిలాబాద్: బకాయిలు చెల్లించకపోవడంతో బైంసా వ్యవసాయ మార్కెట్ కార్యలయానికి తాళం వేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బైంసాలో గురువారం జరిగింది. వివరాలు.. బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎమ్‌సీ)కార్యాలయానికి సంబంధించి ఆస్తి పన్ను రూపంలో రూ. 26 లక్షలు, మార్కెట్‌యార్డు ఖాళీ స్థలానికి సంబంధించి రూ. 3.68 కోట్లు మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉంది. సకాలంలో పన్నులు చెల్లించాలని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా మార్కెట్ యార్డు అధికారులు స్పందిచకపోవడంతో గురువారం మున్సిపల్ అధికారి విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో మార్కెట్ కార్యాలయానికి తాళం వేశారు. దీంతో మార్కెట్ యార్డు రోజువారి కార్యక్రమాలు నిలిచిపోయాయి. రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడటంతో దిగివచ్చిన మార్కెట్ యార్డు అధికారులు, మున్సిపల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, ముందుగా 10 శాతం నిధులు చెల్లించాలని, 15 రోజుల్లో మిగిలిన నిధులకు సంబంధించిన హామీ ఇవ్వాలని మున్సిపల్ అధికారులు పట్టుబడుతున్నారు. ఈ పరిణామాలతో సమస్య ఇంకా పరిష్కారం కాలేదు.
(బైంసా)

మరిన్ని వార్తలు