కదంతొక్కిన కార్మిక లోకం 

10 Jan, 2019 09:50 IST|Sakshi
బైక్‌ ర్యాలీలో టీఎన్‌జీవోస్‌ నాయకులు

ఎదులాపురం(ఆదిలాబాద్‌): కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ, ప్రజావ్యతిరేక విధానాలు నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు కార్మికలోకం కదంతొక్కింది. రెండురోజుల సార్వత్రిక సమ్మె జిల్లాలో సక్సెస్‌ అయింది. చివరి రోజు బుధవారం పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తించాయి.
 
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో..
సార్వత్రిక సమ్మెలో భాగంగా వివిధ సంఘాలుఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, సీఐటీయూ కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఎదుట ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు ని యంత్రించి అదుపులో పెట్టాలని డిమాండ్‌ చేశా రు. కనీస వేతనం నెలకు రూ.18 వేలుగా నిర్ణయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకాన్ని, కార్మిక చట్టాల సవరణ ఆపాలని, వాటిని పకడ్బందీగా అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ, బోనస్‌ చట్టాలు విధిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో ఏఐటీయూసీరాష్ట్ర కార్యదర్శి ఎస్‌.విలాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు, సీఐటీ యూ జిల్లా కార్యదర్శి డి.మల్లేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్‌ రాజేందర్, ఐఎఫ్‌ టీయూ జిల్లా అధ్యక్షుడు బి.జ గన్, కార్యదర్శి వెంకట నారాయణ, అనుబంధ సంఘాల నాయకులు ముడుపు ప్రభాకర్, కిరణ్, బండి దత్తాత్రి, లంకా రాఘవులు పాల్గొన్నారు.

టీఎన్‌జీవోస్‌ ఆధ్వర్యంలో..
తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ (టీఎన్‌జీవోస్‌) సంఘం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ ద్వారా నిరసన తెలిపారు. ఎన్జీవోస్‌ మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పర్మినెంట్, సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ అమలు, ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు అశోక్, తాలు కా అధ్యక్షుడు ఎ.నవీన్‌కుమార్, కార్యదర్శి మ హేందర్, సెంట్రల్‌ కార్యదర్శి ఎ.తిరుమల్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, తుమ్మల గోపి, గం గాధర్‌ చిట్ల, ఆర్‌.శ్రీనివాస్‌  పాల్గొన్నారు.

వైద్య ఉద్యోగుల ఆధ్వర్యంలో..
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మినిస్టీరియల్‌ సం ఘం ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట నిరనస ప్రదర్శన చేపట్టారు. సీపీఎస్‌ రద్దు చేయాలని నినాదాలు చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో సంఘం శ్రీకాంత్, మహేందర్, సుధీర్‌  తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్న కార్మికుల ఆధ్వర్యంలో..
మధ్యాహ్న భోజన కార్మికులు (ఏఐటీయూసీ అనుబంధం) డీఈవో కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరునెలలుగా వేతనాలు అందించడం లేదని, ప్రభుత్వం కోడి గుడ్లకు రూ.4 అందిస్తోందని, బయట రూ.6కు లభిస్తుండగా అదనంగా రెండు రూపాయల భారం నిర్వాహకులపై పడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.  జిల్లా కార్యదర్శి కె.రాములు, పట్టణ కార్యదర్శి టి.పుష్పలత, పట్టణ సహా య కార్యదర్శి జి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు